నిరుద్యోగ యువత..రేవంత్‌ను నిలదీయాలి

18
- Advertisement -

నిరుద్యోగ యువత సీఎం రేవంత్‌ను నిలదీయాలన్నారు బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంఛార్జ్ దాసోజు శ్రావణ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన దాసోజు… సీఎం రేవంత్ రెడ్డి మోడీని బడా బాయ్ అంటున్నారు .గుజరాత్ మోడల్ ను తెలంగాణ లో అమలు చేస్తామంటున్నారు…..రేవంత్ రెడ్డి మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా ,నిర్లజ్జగా మాట్లాడుతున్నారన్నారు.

రేవంత్ రెడ్డి ఓ పాథాలజికల్ లయర్…..అబద్దాల పునాదుల మీద పాలన చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ..కేసీఆర్ హయం లో ఇచ్చిన నోటిఫికేషన్ లు కూడా అందులో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అబద్దాలు చెప్పి అధికారం లోకి వచ్చారు ..ఇపుడు అవే అబద్దాలు చెబుతున్నారు ..రేవంత్ సమర్థుడైతే కొత్తగా ఉద్యోగాలు సృష్టించాలని డిమాండ్ చేశారు.

రేవంత్ నయవంచనకు పరాకాష్ట అని… 30 వేల ఉద్యోగాలు ఇచ్చాను అనడం పచ్చి అబద్దం అన్నారు. 30 వేల ఉద్యోగాలకు ఎపుడు నోటిఫికేషన్లు వచ్చాయో ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉన్నాయి .తెలుసు కోవాలన్నారు. తెలంగాణ సమాజం రేవంత్ తీరును గమనించాలని…..కేసీఆర్ హయం లో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తు చేశారు.

పదే పదే అబద్దాలు చెప్పి రేవంత్ లేకితనం ప్రదర్శిస్తున్నారని……దేశం లో ఎన్నడూ లేని నిరుద్యోగం ఉందన్నారు. రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే కొత్త ఉద్యోగాలు భర్తీ చేయాలి…..ఉద్యోగాల ఖాళీల పై శ్వేత పత్రం ప్రకటించాలన్నారు. రేవంత్ తాను సీఎం నన్న సంగతిని మరచి పోయి మాట్లాడుతున్నాడు ….నిరుద్యోగ యువత రేవంత్ ను నిలదీయాలన్నారు. రేవంత్ చేపలు గొర్రెల పంపిణీ గురించి కుల వృత్తులను అవమాన పరిచేలా మాట్లాడారు…..కాంగ్రెస్ మేనిఫెస్టో లోనే గొర్రెల పంపిణీ గురించి ప్రస్తావించారన్నారు. మోడీ ని బడే బాయ్ అంటున్నరు రేవంత్…..రాహుల్ గాంధి ఓ వైపు మోడీ ని దించేయాలని చూస్తుంటే రేవంత్ ఆయనే ప్రధాని గా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. రేవంత్ మోడీ ల మధ్య ఒప్పందం ఏమిటీ ?,కాంగ్రెస్ బీజేపీ ల మధ్య తెలంగాణ లో చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:Kajal:గ్యాప్ ఇవ్వబోతున్న కాజల్ అగర్వాల్

- Advertisement -