‘కల్కి’ లో ఆమె, అలాగే ఆయన కూడా

16
- Advertisement -

నాగ్‌ అశ్విన్‌ – ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలో నట కిరీటి రాజేంద్రప్రసాద్‌ కూడా పాలుపంచుకోనున్నారు. ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్‌ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా, ఈ పాన్ వరల్డ్ మూవీలో ఇప్పటికే కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్ లాంటి అగ్ర తారలు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరో యంగ్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఓ అతిధి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు శ్రీలీల. ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు ప్రభాస్ కల్కిలో కూడా అవకాశం వచ్చింది అని టాక్. అందుకే, ఆమె కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఇందులో భాగంగానే ఇక శ్రీలీలా సినిమాలకు బ్రేక్ తీసుకుందన్న వార్తలు సోషల్ మీడియా లో వినిపిస్తున్నాయి. ఎంబీబీఎస్ చదువుతున్న ఆమె.. మొదట పరీక్షల కోసం బ్రేక్ తీసకున్నారని టాక్. ఆ తర్వాత
శ్రీలీల పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తోంది.

కాబట్టి, చిన్న సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అని అన్నారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది కాబట్టే బ్రేక్ ఇచ్చింది అంటున్నారు. అన్నట్టు మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం కల్కి కోసం ఫుల్ డేట్స్ కేటాయించాడు. ఇంత బిజీలో కూడా ప్రభాస్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న “గామి” సినిమాకి సపోర్ట్ అందించాడు. ప్రభాస్ స్పెషల్ విషెస్ తెలుపుతూ… ‘ ట్రైలర్ చూసాక వీడియో బైట్ ఇచ్చి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాలని అనుకున్నా. విశ్వక్ సేన్ ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మొదటి సారి టీజర్ విక్కీ చూపించినపుడు చాలా బాగా అనిపించింది. మార్చి 8 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా’ అని అన్నారు.

Also Read:Modi:తెలంగాణకు మోడీ.. క్లారిటీ వచ్చేనా?

- Advertisement -