‘దేవర 1’లో మార్పులు.. ఎన్టీఆర్ నిర్ణయం

25
- Advertisement -

ఎన్టీఆర్ – కొరటాల శివ ‘ దేవర పార్ట్1’ సినిమా అప్ డేట్ కోసం తారక్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మొన్నామధ్య దేవర పార్ట్ 1 కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో మళ్లీ బ్రేక్ తీసుకున్నారు. ఈ సినిమా కథలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కి సంబంధించి వచ్చే ఓ ప్లాష్ బ్యాక్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని తాజాగా టీమ్ ఫిక్స్ అయ్యింది. నిర్ణయం ఎన్టీఆర్ దే గానీ, దర్శకుడు కొరటాల శివ కూడా ఈ మార్పులకు సముఖంగా ఉన్నాడని తెలుస్తోంది.

అయితే, దేవర పార్ట్ 1 కథలో ఇప్పుడు కొత్తగా మార్పులు చేర్పులు చేసుకుంటూ కూర్చుంటే.. ఇక బ్యాలెన్స్ షూటింగ్ ఎప్పుడు ఫినిష్ చేస్తారు ? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. ఐతే, షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకుండా తన టీమ్ తో దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ చేస్తాడట. పైగా ఈ గ్యాప్ లో యాక్షన్ సీన్స్ ను షూట్ చేసుకుంటూ వెళ్తారట. యాక్షన్‌ సీన్స్‌ కోసం ఇప్పటికే రామ్ – లక్ష్మణ్ మాస్టర్లు కసరత్తులు చేస్తున్నారు. ఇక దేవర పార్ట్ 1లో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా దేవర పార్ట్ 1 సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.

సీన్స్ ను నెలల తరబడి చెక్కే కొరటాల శివ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫ్రేమ్ బై ఫ్రేమ్.. సీన్ బై సీన్.. నిదానంగా తీయడం కొరటాల శివకి అలవాటు. ప్రస్తుతం దేవర పార్ట్ 1 పరిస్థితి అదే. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పటికీ పూర్తి అవుతుందో చూడాలి. అన్నట్టు దేవర పార్ట్-1 క్లైమాక్స్ కోసం కూడా ప్రస్తుతం చాలా వర్క్ చేస్తున్నారు. ఇక దేవర సినిమా సముద్రం నేపథ్యంలో జరుగుతుంది. రివెంజ్ డ్రామాగా ఈ సినిమా కథను కొరటాల శివ తన మార్క్ ఉండేలా కథని రాసుకున్నారట.

Also Read:Trisha:అసలు ‘త్రిష’కే ఎందుకు ఇలా?

- Advertisement -