లిటిల్ ‘కింగ్ కోహ్లీ’ కి స్వాగతం!

30
- Advertisement -

క్రికెట్ రారాజు రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి అయ్యాడు. ఈ నెల 15 న తమకు మగ బిడ్డ పుట్టినట్లు ఇన్ స్టాలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. తన కొడుకు పేరు ఆకాయ్ ( akaay ) అని ఈ విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా అధికారికంగా వెల్లడించాడు. తన తనయుడికి అందరి ఆశీర్వాదం కావాలని కోరాడు. దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. లిటిల్ కింగ్ కోహ్లీకి స్వాగతం అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ” స్పందిస్తూ అందమైన కుటుంబంలోకి అకాయ్ వచ్చినందుకు అభినందనలు తెలుపుతూ లిటిల్ ఛాంపియన్ కి స్వాగతం అంటూ పోస్టు చేశాడు. .

విరాట్ కోహ్లీ, అనుష్క జోడీకి 2017లో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి మూడేళ్ళ కూతురు ( వామిక ) కూడా ఉంది. ఇప్పుడు రెండో సంతానంగా అకాయ్ జన్మించాడు. గత కొన్నిరోజులుగా అనుష్క ప్రెగ్నెన్సీ పై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. కానీ సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ విరాట్ అనుష్క ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇవ్వడంతో అందరికీ తెలిసింది. ఆ కారణంగానే ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ కు కూడా విరాట్ దూరమయ్యాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో గడుపుతున్న విరాట్ కోహ్లీ క్రికెట్ కు బ్రేక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ తర్వాత స్టార్ట్ అయ్యే ఐపీఎల్ కు కోహ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి విరాట్ కోహ్లీకి పండంటి కొడుకు పుట్టడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read:మగవారికే బట్టతల ఎక్కువ.. ఎందుకు ?

- Advertisement -