సమ్మర్ లో అందరి దృష్టి మామిడి పండ్లపై పడడం సహజం. ఎందుకంటే కేవలం సమ్మర్ లో మాత్రమే దొరికే ఈ పండు తినడానికి అందరూ కూడా అమితమైన ఇష్టం కనబరుస్తుంటారు. అందుకే రుచిలోనూ పోషకాలలోనూ దీనిని పండ్లలో రారాజుగా పరిగణిస్తుంటారు. మామిడి పండులో విటమిన్ ఏ, సి, డి వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పాలీఫెనొలిక్ ఫ్లెవనాయిడ్లు, ప్రీబయోటిక్ డైటరీ పీచు పదార్థాలు ఇంకా ఐరన్, పొటాషియం, మెగ్నీషియం.. ఇలా అన్నీ రకాల పోషకాలతో మిళితమై ఉంటుంది మామిడి పండు అందుకే సమ్మర్ లో దొరికే మామిడి తప్పనిసరిగా అందరూ తినాలని ఆహార నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే కేవలం మామిడి పండుతో మాత్రమే కాకుండా మామిడి ఆకులతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయట..
మామిడి ఆకులను సాధారణంగా ఇంటి శుభకార్యాలకు వాడుతుంటారు. అయితే చాలమందికి తెలియని విషయం ఏమిటంటే మామిడి ఆకులను ఆయుర్వేదంలో వివిధ ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ మైక్రోబియల్ గుణాలు.. అన్ని రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయట. మామిడి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని ప్రతిరోజూ సేవిస్తే రక్తపోటు అదుపులోకి వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా మామిడి ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకొని కషాయంలా తాగితే జలుబు, ఆస్తమా వంటి సమస్యలు దూరమౌతాయట. కాబట్టి మామిడి ఆకులను ఆయా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు దివ్యఔషధంలా ఉపయోగించడం మంచిదేనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read:అప్పుల ఊబిలో సీనియర్ హీరో