అరటిపండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. ఎందుకంటే అరటిలో మన శరీరానికి అవసరమైన పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ బి6, బి12 వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ప్రతిరోజూ కనీసం ఒక అరటిపండు అయిన తింటూ ఉంటారు చాలమంది. అయితే అరటిపండుతోనే కాదు అరటి పువ్వు తో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పల్లెల్లో అరటిపువ్వును వివిధ రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తుంటారు. అరటి పువ్వుతో ఉదయం పూట సూప్ తయారు చేసుకుని తాగితే కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఇంకా శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది.
అరటిపువ్వును నిత్యం ఏదో ఒక రకంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇంకా ఇందులో ఉండే పొటాషియం మూత్ర సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుందట. చాలమంది నోటు దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు అరటిపువ్వును ప్రతిరోజూ ఉదయం పూట నమలడం వల్ల నోటి దుర్వాసన దూరమౌతుంది. పురుషుల్లో వీర్య వృద్దిని పెంచడంలో అరటిపువ్వు ఎంతో ప్రయోజనకారి. అలాగే స్త్రీలలో వచ్చే గర్భాశయ లోపాలు, రుతుక్రమ సమస్యలు వంటివాటికి కూడా అరటిపువ్వు ఔషధంలా పని చేస్తుందట. అయితే అరటిపువ్వు వల్ల నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని పచ్చిగా తినడం వల్ల అలెర్జీకి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి, అలాగే దీని మోతాదు ఎక్కువైతే విరోచనాలు కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి అరటిపువ్వు ను పరిమితి మేరకే తినాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక : ఈ సమాచారం మీ అవగాహన కొరకు అందించబడినది. పై సలహాలు సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల అనుమతి తప్పనిసరి అని గ్రహించగలరు.
Also Read:కేసీఆర్ బస్సు తనిఖీ..