పుష్పక విమానం, స్వాతిముత్యం చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో అభిమానులని సంపాదించుకున్న వర్ష బొల్లమ్మ నేడు ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన నటనతో మరోసారి ఆమె ఆకట్టుకుంది. అలాగే, వచ్చే నెలలో మొదలు కాబోయే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా వర్ష బొల్లమ్మ నటిస్తోంది. మొత్తానికి సౌత్ లో క్రేజీ భామగా మారలేకపోయినా, వర్ష బొల్లమ్మకి మాత్రం మంచి డిమాండే ఉంది. కాకపోతే, తెలుగులో అదిరిపోయే బ్రేకిచ్చే ఛాన్స్ మాత్రం రావడం లేదు.
తమిళ సినిమాలు చేస్తూ.. తెలుగు స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇచ్చిన వర్ష బొల్లమ్మకి చూసి చూడంగానే, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాలు హీరోయిన్ గా బ్రేకిచ్చాయి. అయితే వర్ష బొల్లమ్మ గ్లామర్ గా కన్నా ట్రెడిషనల్ గానే హైలెట్ అయ్యింది. తాజాగా వర్ష బొల్లమ్మ తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసారంటూ సంచలనంగా మాట్లాడింది. తన బాడీ ఇలా ఉంది అలా ఉంది అని కామెంట్స్ చేశారు అని వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చింది. అలాగే, వర్ష బొల్లమ్మ ఇంకా మాట్లాడుతూ.. ‘మీరు చేసిన పాత్ర సెక్సీగానే ఉన్నా, మీరు మాత్రం సెక్సీగా లేరు,
కానీ మీరు ఆ పాత్రకి దగ్గరగా కనిపించలేదని అన్నారు. ఓ ఫోటోగ్రాఫర్ నా పాత్రని చూడకుండానే కామెంట్ చేసాడు, అసలు ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు అంటూ షాకింగ్ గా మాట్లాడారు. ఆ తర్వాత తాను నాకు క్షమాపణ కూడా చెప్పాడు. ఓ సాంగ్ చెప్పినప్పుడు నువ్వు లావుగా ఉన్నావు, బరువు తగ్గమని అన్నారు. నా బరువుతో నాకు ఎలాంటి సమస్య లేనప్పుడు మీరెందుకు ఫీలవుతున్నారని గట్టిగానే ఇచ్చిపడేసాను’ అంటూ వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చింది. మొత్తానికి వర్ష బొల్లమ్మ కూడా చాలా అవమానాలను ఎదుర్కొంది.
Also Read:నల్ల ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో!