యాక్టీవ్ అవుతున్న కీర్తి సురేష్

22
- Advertisement -

కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఖాళీగానే కనిపిస్తోంది. ‘హాయ్ నాన్న’ వద్దనుకుందో, లేదంటే ఆమెని తప్పించారో కానీ, కీర్తి సురేష్ ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత గుంటూరు కారం సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆ సినిమా కూడా ఆమె ఖాతాలో పడలేదు. మొత్తానికి ఆ ప్లాప్ నుంచి కీర్తి సురేష్ సేవ్ అయినట్లే. ‘గుంటూరు కారం’ చిత్రంలో శ్రీలీల క్యారెక్టర్ ని మరీ చీప్ గా చూపించారు. ఒకవేళ, కీర్తి సురేష్ ఈ పాత్ర చేసి ఉంటే.. ఆమె కెరీర్ కి కచ్చితంగా మైనస్ అయ్యేది.

ముఖ్యంగా, శ్రీలీల మహేష్ ని పడేయడానికి, అతనితో సంతకం చేయించడానికి రకరకాలుగా వాడేశారు. ఇలా గానీ, కీర్తి సురేష్ చేసి ఉంటే.. ఆమె అస్సలు సెట్ అయ్యేది కాదు. ఇక గత రెండేళ్లుగా వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో కూడా డల్ గానే కనిపిస్తుంది. కానీ తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్ లో సాంప్రదాయంగా, గ్లామర్ ఫోటోస్ వదులుతూ తనవైపు చూడమని దర్శకనిర్మాతలకు సంకేతాలిస్తోంది.

తరచూ ఇన్స్టా లో ఫోటోలు షేర్ చేస్తుంది. క్యూట్ గా బ్యూటిఫుల్ గా కవ్విస్తూ కనిపిస్తుంది. మరి ఆమె ప్లాప్ లు చూసి సడన్ గా కీర్తి సురేష్ ని సౌత్ పక్కన బెట్టేసింది. శివ నిర్వాణ లాంటి మిడ్ రేంజ్ దర్శకులు మళ్ళీ కీర్తి సురేష్ కి ఓ ఛాన్స్ ఇవ్వాలని ఆసక్తి చూపిస్తున్నారు. సో.. ఇలా నాలుగైదు అవకాశాలు వస్తే.. కీర్తి సురేష్ మళ్ళీ యాక్టీవ్ అవుతుంది. అన్నట్టు, కీర్తి సురేష్ తమిళనాట ఓ ఆఫర్ వచ్చింది అనే న్యూస్ ఉంది. అది ఇంకా ఫైనల్ అవ్వాల్సి ఉంది.

Also Read:ఎన్టీఆర్ సరసన నటించనుందా?

- Advertisement -