- Advertisement -
బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ పెద్దలతో, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా అధినేత ఆదేశాలతో ఇవాళ రవిచంద్ర రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా రవిచంద్ర ఉండగా ఆయన పదవీకాలం ముగుస్తుండటంతో మరోసారి అవకాశం కల్పించారు. 2018లో వరంగల్ తూర్పు నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు రవిచంద్ర. ఆ తర్వాత 2022లో బీఆర్ఎస్‌లో చేరగా రాజ్యసభకు నామినేట్ చేశారు కేసీఆర్.
కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ యాదవ్ పేర్లు ఖరారు కాగా మొత్తం మూడు స్థానాలను ముగ్గురే నామినేషన్ దాఖలు చేయడంతో రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.
Also Read:గోంగూర ఎక్కువగా తింటున్నారా?
- Advertisement -