సుధీర్ బాబు…‘హరోం హర’ టైటిల్ ట్రాక్

11
- Advertisement -

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం హరోం హర విడుదలకు సిద్ధమవుతోంది. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ చిత్రం సుధీర్ బాబును మునుపెన్నడూ లేని ఇంటెన్స్ అవతార్‌లో ప్రజెంట్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది.

మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్- హరోం హరను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. చైతన్ భరద్వాజ్ స్కోర్ చేసిన ఈ ఎనర్జిటిక్ నెంబర్ దైవిక శక్తి అనుభూతి అందిస్తోంది, ఇది ఓ ఫెరోషియస్ హీరో అద్భుత కథ.

కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని ఈ పాటకు పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు, దీనికి అనురాగ్ కులకర్ణి డైనమిక్ వాయిస్ తో ఆకట్టుకున్నారు. స్వరకర్త చైతన్ భరద్వాజ్ స్వయంగా ఎడిషనల్ వోకల్స్ అందించారు. పాటలో సుధీర్ బాబు బ్రూటల్ గా కనిపించారు. విజువల్స్ టాప్-నాచ్ గా ఉన్నాయి. ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడిగా నటిస్తున్న మాళవిక శర్మ కూడా ఈ పాటలో కనిపించింది.

కంపోజిషన్, లిరిక్స్ , వోకల్స్, విజువల్స్ అన్నీ అద్భుతంగా వున్న ఈ ట్రాక్ చార్ట్‌బస్టర్ గా అలరుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు.చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే హరోం హర కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు చెప్పనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి ది రివోల్ట్ అనేది ట్యాగ్ లైన్.

అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Also Read:గోంగూర ఎక్కువగా తింటున్నారా?

- Advertisement -