తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చేస్తున్న రాద్దాంతం విమర్శల పాలు అవుతోంది. ఎన్నికల ముందు నుంచి కాళేశ్వరంపై విమర్శలు గుప్పిస్తు వస్తున్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అదే తరహాలో వ్యహరిస్తుండడంతో రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు రేవంత్ రెడ్డి బృందం రెడీ అయిన సంగతి తెలిసిందే. మంత్రులు, ఎమ్మేల్యేలు ఈ ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ లో పిల్లర్లు కుంగడాన్ని తరచూ చర్చకు తీసుకోస్తున్న కాంగ్రెస్ నేతలు… నేడు ఆ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్ళడంపై బిఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ విషయంలో పొరపాట్లు జరిగాయని గతంలో కేటిఆర్ కూడా ఒప్పుకున్న సంగతి విధితమే. .
ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పొరపాట్లను సరిదిద్దడం మాని.. దాని చుట్టూ రాజకీయం చేస్తోందనే విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ మాత్రమే కాదని అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్ లు, 21 పంప్ హౌజులు, 1,531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్,.. ఇవన్నీ ఉన్నాయని వాటిని సందర్శించకుండా కేవలం మేడిగడ్డ ప్రాజెక్ట్ ను మాత్రమే బూతద్దంలో చూపిస్తూ రాద్దాంతం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. దానిని మరింతగా తీర్చిదిద్దడం మాని కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు నిజంగా సిగ్గుచేటు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది.