కృష్ణా నది ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో అధికార – ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ – మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్…మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పట్టుబట్టారు.
నదీజలాలు, ప్రాజెక్టులపై అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్నారని విమర్శించారు రేవంత్. సభకు రాకుండా కేసీఆర్ ఎందుకు ముఖం చాటేశారని… ఆయన సభలోకి వస్తే ఎంతసేపైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి 10 లక్షల మందిపైగా వలస వెళ్లారు. 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరిమితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యోపాపని ఆదరించి ఎంపీగా గెలిపించారు. ఇవాళ ఆ జిల్లాకు సంబంధించిన కీలక చర్చ జరుగుతుంటే శాసనసభకు రాకుండా ఉన్నారని..పాపాల భైరవుడు అంటూ కామెంట్ చేశారు.
దీనికి మాజీ మంత్రి హరీష్ రావు సైతం స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని …కేసీఆర్ ను కరీంగనర్ నుంచి తరిమితే మహబూబ్ నగర్ వచ్చారని రేవంత్ అన్నారు… కేసీఆర్ జీవితంలో ఓటమి ఎరుగని నాయకుడు. సిద్ధిపేట, గజ్వేల్, కరీంనగర్, మహబూబ్‌నగర్.. ఎక్కడా ఓడిపోలేదు అన్నారు. మరి నిన్ను కొడంగల్ నుంచి తరిమితే మల్కాజ్‌గిరికి వచ్చావా? నువ్వెందుకొచ్చావ్ మల్కాజ్‌గిరికి? ఒక వేలు మావైపు చూపిస్తే.. రెండు వేళ్లు మీవైపు చూపిస్తాయి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హరీష్.
Also Read:వైసీపీ క్లారిటీ.. రాజధాని ‘అమరావతే’!