Harish:KRMBపై కాంగ్రెస్‌ది ఫేక్ ప్రెజెంటేషన్‌

21
- Advertisement -

కృష్ణా ప్రాజెక్టుల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఫేక్ ప్రజంటేషన్ అని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో కేఆర్ఎంబీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఇచ్చిన పవర్ ప్రజంటేషన్‌పై మాట్లాడిన హరీష్…కాంగ్రెస్ తెచ్చిన పుస్తకానికి వాస్తవాలు కాకుండా అవాస్తవాలు అని పెడితే బాగుంటుందన్నారు. పదేళ్లు కేసీఆర్‌ ఉన్నప్పుడు చేయనిది… కాంగ్రెస్ వచ్చిన రెండు నెలల్లోనే కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించారని ఆరోపించారు.

అసెంబ్లీలో మాకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే బాగుండేదన్నారు. అన్ని వాస్తవాలు సభకు తెలియాలన్నారు. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజల విజయం,,,బి ఆర్ ఎస్ పార్టీ విజయమన్నారు. రేపు నల్లగొండలో బీఆర్ఎస్ సభ ఉండటం వల్లే కాంగ్రెస్ ఈ తీర్మానం చేసిందన్నారు. చేసిన తప్పులు సవరించుకున్నందుకు ధన్యవాదాలన్నారు.

Also Read:KTR:ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొలి విజయం

- Advertisement -