‘వైశాఖం’ పెద్ద హిట్‌ అవుతుంది – కొరటాల

202
- Advertisement -

సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఆర్‌.జె. సినిమాస్‌ కార్యాలయానికి విచ్చేశారు. వైశాఖం థీమ్‌ టీజర్‌’ను విడుదల చేసిన ఆయన ‘వైశాఖం’ పాటల్ని వీక్షించి చిత్ర యూనిట్‌ని అభినందించి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. హరీష్‌, అవంతిక జంటగా డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు నిర్మించిన ‘వైశాఖం’ చిత్రం జూన్‌ ఫస్ట్‌వీక్‌లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది.

Koratala Shiva launches Vaisakham theme teaser

ఈ సందర్భంగా సూపర్‌డైరెక్టర్‌ కొరటాల శివ మాట్లాడుతూ – ”వైశాఖం సినిమా ట్రైలర్‌, సాంగ్స్‌ చూశాను. చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాయి. ఓ పెద్ద సినిమా రేంజ్‌లో సినిమా మేకింగ్‌ కనపడుతుంది. జయ డైరెక్ట్‌ చేసిన సినిమాలు నేను చూశాను. ఆమె చాలా ఫ్యాషనేట్‌ డైరెక్టర్‌. ఉమెన్‌ డైరెక్టర్స్‌ తెలుగు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉన్నారు. జయ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ సినిమాలు చేస్తున్నారు. జయని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఇంకా లేడీ డైరెక్టర్స్‌ రావాలి. సాంగ్స్‌ ప్రామిసింగ్‌గా, బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. క్వాలిటీ విషయంలో రాజు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా గ్రాండ్‌ లెవల్లో సినిమాను చేశారు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యి జయకి మంచి పేరు, మా రాజుకి మంచి డబ్బులు తీసుకురావాలని కోరుకంటున్నాను. ఎంటైర్‌ వైశాఖం టీంకు ఆల్‌ ది బెస్ట్‌. డెఫనెట్‌గా సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది” అన్నారు.

Koratala Shiva launches Vaisakham theme teaser

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ.బి మాట్లాడుతూ – ”డైరెక్టర్‌ కొరటాల శివ రైటర్‌గా ఉన్నప్పటి నుండి ఆయనంటే ఆడ్మిరేషన్‌. ఆయన సినిమాలు ఎంత గొప్పగా ఉంటాయో మనకు తెలిసిందే. చాల సింపుల్‌ పాయింట్‌తో ఆయన సినిమాల్లో ఎటిక్విటి ఉంటుంది. నేను ఓ రకంగా శివకి ఫ్యాన్‌. లవ్‌లీని కూడా ఎటిక్విటి ఉన్న సినిమాగా తీయాలని ప్రయత్నించాను. కొరటాల శివ టీజర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. మాపై అభిమానంతో వచ్చి కొరటాలశివ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ టీజర్‌ను విడుదల చేసినందుకు ఆయనకు థాంక్స్‌” అన్నారు.

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ – ”కొరటాల శివతో ముందు నుండి చాలా మంచి అనుబంధం ఉంది. మా సూపర్‌హిట్‌ 20 సంవత్సరాల వేడుకలో ఆయనకు బృందావనం సినిమాకు బెస్ట్‌ రైటర్‌గా అవార్డు వచ్చింది. అప్పుడే ఆయన పెద్ద డైరెక్టర్‌ అవుతారని చెప్పాం. మేం చెప్పినట్లుగానే కొరటాల శివగా మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్‌ వంటి ఒకదాని మించి మరో హిట్‌ మూవీస్‌ చేశారు. ఇప్పుడు నిన్ననే సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా కొత్త సినిమాను స్టార్ట్‌ చేశారు. ఆ సినిమా వచ్చే ఏడాది జనవరి 11న విడుదలైన సూపర్‌హిట్‌ చిత్రంగా నిలుస్తుంది. కొరటాల శివ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ కూడా మాపై అభిమానంతో వచ్చి తన గోల్డెన్‌ హ్యాండ్‌తో సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది. సినిమాను జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది” అన్నారు.

Koratala Shiva launches Vaisakham theme teaser

హీరో హరీష్‌ మాట్లాడుతూ – ”ఈరోజు చాలా ఆనందంగా ఉంది. హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ కొరటాల శివ వైశాఖం సినిమాలో సాంగ్స్‌, ట్రైలర్‌ చూసి నన్నెంతో అప్రిసియేట్‌ చేశారు. వైశాఖం సినిమా చేయడం నిజంగా నా లక్‌. సినిమా రిలీజ్‌కు ముందే నా డ్రీమ్‌ డైరెక్టర్స్‌ను కలిసే అవకాశం వస్తుంది. కొరటాల ఎంతో బిజీగా ఉన్నా, మా కోసం ఆయన వచ్చినందుకు ఆయకు థాంక్స్‌. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు రాజు, జయకి స్పెషల్‌ థాంక్స్‌” అన్నారు.

 

- Advertisement -