ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర 2లో, ఆయనతో పాటు కలిసి నటించే అద్భుతమైన అవకాశం రాబోతుంది. అయితే, ఈ అవకాశం కేవలం వైజాగ్ జాల్లర్లకు మాత్రమే. అవును.. ఎన్టీఆర్ – కొరటాల శివ ‘దేవర’ సినిమా కోసం ఉత్తరాంధ్ర యాసలో అనర్గలంగా డైలాగ్స్ చెప్పే కొత్త నటీనటులను దేవర 2 కోసం తీసుకుంటున్నారు. దీని కోసం కొరటాల శివ అండ్ టీమ్ ఈ నెల్లోనే ఉత్తరాంధ్రలో పర్యటించనుంది. నిజానికి దేవర సినిమా పార్ట్ 1 షూటింగ్ కి బ్రేక్ పడింది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కానీ అనుకోకుండా సైఫ్ కి గాయాలు కావడంతో ప్రస్తుతానికి సైఫ్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చాడు.
దాంతో దేవర షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో కొరటాల ‘దేవర పార్ట్ 2’ కోసం నటీనటులను వెతికే పనిలో పడ్డారు. దేవర పార్ట్ 2 కోసం ఒకరు, ఇద్దరు కాదు, ఏకంగా 200 మంది ఆర్టిస్టులు కావాలి. వీళ్లలో ఎక్కువమంది ఉత్తరాంధ్ర వాసులే ఉండాలి. అందుకే ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు ఉత్తరాంధ్రకు చెందిన విశాఖ, విజయనగరం, సాలూరు, శ్రీకాకుళంలో టీమ్ పర్యటించబోతోంది దేవర టీమ్. కాగా ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మూవీ దేవర. ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఎంతైనా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా దేవర.
కాబట్టి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచాలను అందుకోవాలి అంటే.. అదిరిపోయే కంటెంట్ ఉండాలి. అందుకే, దర్శకుడు కొరటాల శివ కూడా ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అన్నట్టు దేవర సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ ఓ ప్రముఖ సంస్థకు లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. దేవర వచ్చే ఏడాది ఏప్రిల్ 5 నుంచి రిలీజ్ డేట్ ను పోస్ట్ ఫోన్ చేసుకుంది. మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Also Read:జామ ఆకులతో ఉపయోగాలు తెలుసా!