ఆ జిల్లాల్లో వైసీపీ.. పనైపోయిందా?

38
- Advertisement -

అధికార వైసీపీకి ఈసారి ఎన్నికల్లో ఆయా జిల్లాల పరంగా షాక్ తగలనుందా ? రెండో సారి అధికారం సాధిస్తామని చెబుతున్నా వైసీపీకి కొన్ని జిల్లాలు ఉలిక్కి పడేలా చేస్తున్నాయా ? అంటే అవుననే సమాధానాలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకొని ఏకంగా 151 సీట్లు సొంతం చేసుకున్నా వైసీపీకి ఈ సారి ఆ స్థాయి విజయం దక్కడం కష్టమే అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కానీ వైసీపీ మాత్రం ఏకంగా 175 సీట్లు సొంతం చేసుకుంటామని కుండబద్దలు కొడుతోంది. దీంతో ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నికలు దగ్గర పడడంతో ఏపీలో సర్వేల కోలాహలం మొదలైంది. .

ఇప్పటికే ఎన్నో సర్వేలు ప్రజల నాడీని తెలిపే ప్రయత్నం చేస్తుండగా.. కొన్ని పార్టీలు వైసీపీకే పట్టం కడుతుంటే మరికొన్ని పార్టీలు టీడీపీ జనసేన కూటమిదే అధికారం అని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ వ్యక్తిగత సర్వేలు చేయించే పనిలో ఉన్నట్లు వినికిడి. అయితే ఈసారి ఎన్నికల్లో వైసీపీకి సీట్లు తగ్గుతాయని పార్టీ అంతర్గత సర్వేలు కూడా తేల్చి చెప్పినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే అధినేత జగన్మోహన్ రెడ్డి.. అభ్యర్థుల విషయంలో భారీగా మార్పులు చేస్తున్నాట్లు చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీకి అధిక సీట్లు కట్టబెట్టిన నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, వంటి జిల్లాల్లో ఈసారి వైసీపీకి గట్టి షాక్ తాగేలే అవకాశం ఉన్నట్లు రాజకీయ వాదులు అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాలతో పాటు గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ గా నిలిచిన కర్నూల్లో కూడా వైసీపీకి గండి పడే అవకాశాలు ఉన్నాయట. అందుకే ఈ జిల్లాలపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు వినికిడి. అభ్యర్థుల విషయంలో కూడా ఈ జిల్లాలోనే ఎక్కువగా మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. కేవలం ఈ జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వైసీపీకి ఓటు బ్యాంకు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఓవరాల్ గా గత ఎన్నికల్లో లభించిన విజయం వైసీపీకి లభిస్తుందా ? లేదా వైసీపీని ప్రజలు తిరస్కరిస్తారా ? అనేది చూడాలి.

Also Read:ఛలో నల్గొండ..సమన్వయ కర్తలు వీరే

- Advertisement -