కేసీఆర్ ఈజ్ బ్యాక్‌..

38
- Advertisement -

మాజీ సీఎం,బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చారు. కృష్ణా పరివాహక జిల్లాలైన మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్‌,హరీష్‌, కడియం, పొన్నాలతో పాటు సీనియర్ నేతలంతా హాజరయ్యారు.

ఇక కేసీఆర్ రాక సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద కోలాహలం నెలకొంది. భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. సీఎం..సీఎం అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని, ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీని నిలదీస్తారని హరీష్ రావు అన్నారు. కే

సీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ మీరే చూస్తారని …తెలంగాణ సంక్షేమంకోసం, ప్రజల అభివృద్ధికోసం అలుపెరగని పోరాటం చేస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు ప్రజల కష్టాలు పట్టడం లేదని మండిపడ్డారు.

Also Read:కీ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ‘తండేల్’

- Advertisement -