సాధారణంగా వంట గ్యాస్ ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఒకవేళ ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోవడం, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం రెండు సంభవిస్తాయి. అలాంటి టైమ్ లో ఇన్సూరెన్స్ అనేది నష్టపోయిన కుటుంబానికి ఎంతో సహాయం గా నిలుస్తుంది. సాధారణంగా యాక్సిడెంట్, ఇతరత్రా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇన్సూరెన్స్ ద్వారా కుటుంబ సభ్యులు సహాయం పొందుతూ ఉంటారు. కానీ వంటగ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ లభిస్తుందని చాలా మందికి తెలియదు. నిజానికి వంట గ్యాస్ ప్రమాదానికి రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంటుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఎవరైనా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతే రూ.6 లక్షలు వ్యక్తిగత బీమా లభిస్తుంది.
ఒకవేళ గాయపడితే చికిత్స నిమిత్తం ఒక్కో సభ్యుడికి రూ.2 లక్షలు పొందే అవకాశం ఉంది. ఆ విధంగా ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.30 లక్షల వరకు బీమా పొందే అవకాశం ఉంది. ఇలా ఇన్సూరెన్స్ పొందేందుకు సిలిండర్ ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని పోలీసులకు మరియు సంబంధిత ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ కు సమాచారం అందివ్వాలి. అలా చేయడం వల్ల సమాచారాన్ని డిస్ట్రిబ్యూటర్ కంపెనీ మరియు ఇన్సూరెన్స్ అధికారులకు సమాచారం తెలుస్తుంది. ఆ తరువాత ఇన్వెస్టిగేషన్ లో గ్యాస్ ప్రమాదం ధృవీకరణ అయితే ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకునే వీలుంటుంది. అందుకోసం ధృవీకరణ పాత్రలు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, డాక్టర్ సర్టిఫికేట్, వంటి తదితర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇలా ఎవరైనా గ్యాస్ ప్రమాదానికి గురైతే కంపెనీ ఏదైనా ప్రమాదానికి గురైన వారికి ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంటుంది.
Also Read:Congress:కాంగ్రెస్ లో సీట్ల లొల్లి.. షురూ!