అంబాజీపేట మ్యారేజి బ్యాండు..నమ్మకాన్ని నిలబెట్టారు

24
- Advertisement -

ఈ ఇయర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ కు మరో సూపర్ హిట్ ఇచ్చింది “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా. సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా

యాక్టర్ త్రినాథ్ మాట్లాడుతూ – ఈ సినిమాలో ఎర్రన్న అనే మంచి క్యారెక్టర్ చేశాను. నాకే కాదు ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులకు చాలా బలమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇదంతా మా డైరెక్టర్ దుశ్యంత్ గారి ప్రతిభే అని చెప్పాలి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు మరింత పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి దివ్య మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” కొన్ని రోజులకు గుర్తుండిపోయే సినిమా కాదు కొన్ని ఏళ్లు గుర్తుండే మూవీ. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు డైరెక్టర్ దుశ్యంత్ గారు. మూవీ చేస్తున్నప్పుడు శివాని, సుహాస్ ఎంతో సపోర్ట్ చేసి ఫ్రెండ్లీగా ఉన్నారు. థియేటర్ లో శివాని, సుహాస్, నితిన్ పర్ ఫార్మెన్స్ లకు ఆడియెన్స్ బాగా రెస్పాండ్ అవుతున్నారు. టీమ్ అందరికీ నా కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

ఎడిటర్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ – ఇలాంటి మంచి మూవీలో నన్ను పార్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతున్నా. మా ఎడిటింగ్ రూమ్ బన్నీవాస్ గారు, సందీప్ గారు వీళ్లతో కళకళలాడుతూ ఉండేది. సుహాస్ తో పనిచేయడం లక్కీగా భావిస్తున్నా. శివాని ఈ మూవీతో స్టార్ అయ్యింది. నాతో పాటు పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ ఆర్టిస్టులు అందరికీ కంగ్రాట్స్. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్ మాట్లాడుతూ – ఇది నా డెబ్యూ మూవీ. నన్ను నమ్మి సినిమాటోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్, ధీరజ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లంతా ఒక టీమ్ గా వర్క్ చేశారు. సుహాస్ బ్రదర్ నాకు ఎప్పటికీ ఒక ఇన్సిపిరేషన్ గా నిలిచిపోతాడు. అన్నారు.

యాక్టర్ నితిన్ మాట్లాడుతూ – తమిళం, మలయాళంలో వస్తున్న మంచి కంటెంట్ మూవీస్ తెలుగులోనూ రావాలని అనుకునేవారి కోరికను “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” తీర్చిందని అనుకుంటున్నా. థియేటర్స్ విజిటింగ్ చేస్తున్నప్పుడు హాల్స్ లో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. సుహాస్ హీరోను కాదు మంచి యాక్టర్ ను అని ప్రూవ్ చేసుకున్నారు. శివాని, శరణ్య క్యారెక్టర్స్ కథలో హై తీసుకొచ్చాయి. అన్నారు.

Also Read:Congress:కాంగ్రెస్ లో సీట్ల లొల్లి.. షురూ!

హీరోయిన్ శివాని మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” తో హిట్ అందుకున్న మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి కంగ్రాట్స్. ఆయన ఇలాంటి మరెన్నో సక్సెస్ లు అందుకోవాలి. అమ్మా నాన్న తర్వాత నేను రుణపడి ఉండేది మా డైరెక్టర్ దుశ్యంత్ గారికే. ఆయన నన్ను హిట్ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశారు. సుహాస్ వల్లే ఇవాళ ఇలాంటి మంచి సినిమా వచ్చింది. సుహాస్ కు సక్సెస్ కంటిన్యూ కావాలి. లీడ్ పెయిర్ కే కాదు మిగతా ఆర్టిస్టులందరికీ మంచి పేరొచ్చింది. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

- Advertisement -