కేసీఆర్‌పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరికావన్నారు.తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్..హ ప్రతిపక్షంలో ఉన్నా.. మేం ప్రజలపక్షమే అన్నారు. కేఆర్ఎంబీలో ప్రాజెక్టులను అప్పగిస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రయోజనాలపై రేవంత్ రెడ్డికి సోయిలేదని…. కేఆర్ఎంబీ సమావేశంలోనే ప్రాజెక్టులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారు కాబట్టే.. ఉద్యోగులు, వారికిచ్చే జీతాల ప్రస్తావన వచ్చిందని తెలిపారు హరీష్. రేవంత్ సర్కార్ డ్రామాలు ప్రజలకు తెలిసిపోయాయని… అందుకే కేసీఆర్‌పై బురద జల్లేందుకు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు.
రాయలసీమ ఎత్తిపోతలపై స్టే తీసుకొచ్చిందే బీఆర్ఎస్ కదా..? కృష్ణాలో మన నీటి వాటా కోసం కేసీఆర్ పదేండ్లు పోరాడారని గుర్తు చేశారు హరీష్. రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని… నాడు పోతిరెడ్డిపాడు విషయంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు మెదపలేదన్నారు. పదవుల కోసం పార్టీ మారిన చరిత్ర మీది. ప్రజల కోసం త్యాగాలు చేసిన చరిత్ర మాది అన్నారు.
Also Read:Pawan: పవన్ వెనక్కి తగ్గినట్లేనా?