త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదిలాబాద్ జిల్లా లో మాట్లాడిన రేవంత్.. జిల్లా ను దత్తత తీసుకుంటాం అన్నారు.గూడెలకు రోడ్లు, నాగోబా అభివృద్ధి కోసం పనులు ప్రారంభించామన్నారు. సమైక్య పాలన లో నాడు తప్పు జరిగింది.. అప్పుడు క్షమాపణ చెప్పాం…అమర వీరుల కుటుంబాలకి 5 లక్షలు ఇచ్చి అండగా నిలిచాం అన్నారు.
7 వేల స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు ఇచ్చాము…నిరుద్యోగుల భాద చూడలేక కోర్టుల్లో ఉన్న కేసుల్ని పరిష్కరించే ప్రయత్నం చేశాం అన్నారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టల్ భర్తీ బాధ్యత మాది అన్నారు. త్వరలోనే 5 వందల కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం..కడెం రిపేర్ చేస్తాం.. సదర్మాట్, కుప్టి నిర్మిస్తాం అన్నారు.
ప్రజల ప్రభుత్వం మాది ప్రజా ప్రభుత్వం అన్నారు. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్చి అవతలు పడేస్తం అన్నారు. మోడీ ఎవరి ఖాతాలో నైనా 15 లక్షలు వేశాడా…సోయం బాపు రావుకు మంత్రి పదవి ఇచ్చాడా.. మరి ఎందుకు మోదీకి ఎందుకు ఓటు వేయాలన్నారు.మతం పేరుతో ఒక్కరు మధ్యం పేరుతో మరొకరు వస్తారు..ప్రతీ తండా, గూడెంలో కు రొడ్లు వేసే భాధ్యత మాది. రాహుల్ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ ఎంపి సీటు గెలవాలన్నారు.
Also Read:ఫ్యామిలీ స్టార్..రిలీజ్ డేట్ ఫిక్స్