సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఇదే మా నినాదం అన్నారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. ఆరోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా..అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం అన్నారు.కరోనా సంక్షోబాన్ని దేశం అధిగమించిందన్నారు. గత పదేళ్లలో ఇళ్ల నిర్మానానికి కృషి చేశామన్నారు.
నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారన్నారు. పాలనలో పారదర్శకత పెంచామన్నారు.పేదల అభివృద్దే దేశ అభివృద్ధి అన్నారు. అవినీతి,బంధుప్రతీని నిర్మూలించామన్నారు.ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాం..మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. 4 కో్ట్ల రైతులకు పంటభీమా,34 లక్షల జన్‌ధన్ ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు.
దేశంలో 390 విశ్వవిద్యాలయాలను ప్రారంభించామన్నారు.గత పదేళ్లలో ఇళ్ల నిర్మాణానికి కృషి చేశామని, 25 లక్షల మందిని పేదరికం నుండి బయటపడేశామన్నారు.11.8 కోట్ల మందికి పీఎం కిసాన్ నిధులు జమచేశామన్నారు.
Also Read:రోహిత్ శర్మ పనైపోయిందా ?