పేదరిక నిర్మూలనే లక్ష్యం:ముర్ము

20
- Advertisement -

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. నూతన పార్లమెంట్ భవనలో ఇదే తన తొలి ప్రసంగమన్నారు.

గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని…రామమందిర కల సాకారమైందన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాంకింగ్ రంగాల్లో భారత్ ఒకటని వెల్లడించారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కానుందని, ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు.

శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందని తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ గతేడాది చరిత్ర సృష్టించిందన్నారు. సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్-1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించామని, జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించుకున్నామని వివరించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నారీశక్తి వందన్ అధినియం బిల్లును ఆమోదించామని తెలిపారు.

Also Read:మోడీ సర్కార్ ‘చివరి బడ్జెట్’..అవుతుందా?

- Advertisement -