రాజ్యాంగం జనవరి 26నే ఎందుకు అమలైంది?

11
- Advertisement -

భారతీయులకు ప్రాముఖ్యమైన రోజుల్లో జనవరి 26 ఒకటి. ఈ రోజున యావత్ భారతీయులంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. 200 ఏళ్ల బ్రిటిష్ వారి పాలనకు చరమ గీతం పడుతూ ఆగష్టు 14, 1947 లో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. అయితే స్వతంత్రం వచ్చేటప్పటికి బ్రిటిష్ పాలనలో తయారైన చట్టాలే అమల్లో ఉండేవి. దీంతో ఆ చట్టాలు వద్దని మన దేశానికి కూడా ప్రత్యేక చట్టాలు ఉండాలని భావించి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. భారత రాజ్యాంగ రూపకల్ప బాద్యతను డాక్టర్ బి‌ఆర్ అంబేద్కర్ తన భుజాలపై వేసుకొని రూపొందించారు. మొత్తం 389 మంది సభ్యులు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇకపోతే రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్ ఆమోదించినప్పటికి, 1950 జనవరి 26 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు..

అయితే జనవరి 26 ననే రాజ్యాంగం ఎందుకు అమల్లోకి తీసుకొచ్చారనే సందేహం చాలమందిలో ఉంది. అయితే ఈ జనవరి 26 తేదీకి ఓ ప్రాముఖ్యత ఉంది. 1930 జనవరి 26 న లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తొలిసారి సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. అందుకే ఈ తేదీకి గుర్తింపు కల్పించాలనే ఉద్దేశ్యంతో 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు. భారత రాజ్యాంగం ప్రారంభంలో 22 భాగాలు, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉండేవి. కానీ ప్రస్తుతం రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్, 25 భాగాలతో 448 ఆర్టికల్స్ ఉన్నాయి. వీటిలో 104 సవరణలు జరిగాయి. కాలానుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేసుకునే వీలు ఉంటుంది. మన రాజ్యాంగం ప్రపంచంలోని చాలా దేశాలలోని కీలక అంశాలను పరిగణలోకి తీసుకొని రూపొందించారు. ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.

Also Read:లివర్‌ చెడిపోవడానికి కారణం..?

- Advertisement -