Sharmila:జగన్ వల్లే వైఎస్ కుటుంబంలో చీలిక

24
- Advertisement -

సీఎం జగన్ వల్లే వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చిందని మండిపడ్డారు కాంగ్రెస్ నేత షర్మిల. వైఎస్ పాలనకు ప్రస్తుత జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన షర్మిల..వైఎస్‌ కుటుంబం చీలిందంటే చేతులారా జగనన్న చేసుకున్నదేనన్నారు. దీనికి సాక్ష్యం దేవుడు. నా తల్లి విజయమ్మ అన్నారు.

రాజశేఖర్‌రెడ్డి పేరు, ఆశయాలు నిలబెడితే చాలు అనుకున్నా. వైఎస్‌ ఆశయాలు నిలబెడతారని జగన్‌ను ప్రజలు సీఎం చేశారని తెలిపారు. వైఎస్‌ వారసులమని చెప్పడం కాదు. పనితీరులో కనబడాలని జగన్‌కు చురకలు అంటించారు. ఏపీ దయనీయ స్థితికి జగనే కారణమని మండిపడ్డారు.

జగన్ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వారిని మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. జగన్ కోసం నెలల తరబడి పాదయాత్రచేశానని అలాంటి నన్నే జగన్ మోసం చేశారన్నారు. సీఎం అయ్యాక జగన్‌ మోహన్‌ రెడ్డి మారిపోయారని …. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రైతులను నెత్తినపెట్టుకుని పనులు చేశారని, నాడు వ్యవసాయం పండుగగా ఉంటే నేడు జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగగా మారిందని విమర్శించారు.

- Advertisement -