Chandrababu:పీకే వెంటే టీడీపీ.. ఏంటీ స్ట్రాటజీ?

17
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ ను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా ? ఆ దిశగానే వ్యూహాలు రచిస్తున్నారా ? కానీ పీకే టీడీపీతో కలిసేందుకు సుముఖంగా లేరా ? అంటే అవుననే చర్చ జరుగుతోంది. ఆ మద్య ఎవరు ఊహించని విధంగా ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలే సృష్టించింది. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన పీకేతో బాబు బేటీ కావడం ఆసక్తికర పరిణామమే. అయితే ఈ సమావేశం రాజకీయ పరంగా జరగలేదని టీడీపీ శ్రేణులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా పీకేతో కలిసి పని చేసేందుకేనేమో అనే సందేహాలు గట్టిగానే వినిపించాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో పీకే మాట్లాడుతూ ” చంద్రబాబుతో కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని, ప్రస్తుతం తాను ఏ పార్టీతో కలిసి పని చేయడం లేదని.. ” క్లారిటీ ఇచ్చారు.

దీంతో పీకే వైసీపీలో కూడా లేరనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. టీడీపీకి వ్యూహకర్తగా పని చేయాలని నారా లోకేశ్ కోరినట్లు వినికిడి. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం పికే కూడా టీడీపీ తరపున పని చేయడానికి సుముఖంగానే ఉన్నట్లు వినికిడి. అయితే అధికారికంగా పని చేస్తారా లేదా పరోక్షంగా టీడీపీకి కొమ్ము కాస్తారా ? అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. వైసీపీకి బలంగా ఉన్న ముస్లిం మైనారిటీ ఓటర్లను టీడీపీ వైపు తిప్పుకోవాలంటే పీకే స్ట్రాటజీలు తప్పవని చంద్రబాబు భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ వ్యూహకర్తగా పని చేస్తున్నారు. మరి రాబిన్ ను దూరం పెడతారా ? లేదా ఇద్దరిని కూడా చంద్రబాబు ఉపయోగించుకొనున్నారట అనేది చూడాలి.

Also Read:చంద్రబాబు బ్యాడ్ లక్..నో చెప్పిన పీకే!

- Advertisement -