వారికి మాత్రమే స్పెషెల్‌ షో

216
Sachin A Billion Dreams Film
- Advertisement -

సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘సచిన్ : ఎ బిలియన్ డ్రీమ్స్’. ఈ సినిమా మే 26న విడుదల కానుండగా గురువారం ముంబైలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కార్నివాల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. జేమ్స్ ఎర్స్‌కెయిన్ దర్శకత్వం వహించగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించారు.

Sachin A Billion Dreams Film

అయితే ఈ మూవీ ఈ వారంలో థియేటర్లకు రానుంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా? అన్న ఆసక్తిని అటు క్రీడాభిమానులే కాదు.. సినిమా లవ్వర్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరో ఆరు రోజుల్లో రానున్న ఈ సినిమా ప్రత్యేక షోను ఇప్పటికే ప్రదర్శించారు. ఇండియన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆకాడమీలో ప్రత్యేక షోను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి ఇండియన్ ఆర్మీ.. ఎయిర్ ఫోర్స్ తో పాటు.. ఇండియన్ నేవీ అధికారులు తమ కుటుంబాలతో సహా హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. ఈస్పెషల్ స్క్రీనింగ్ కు క్రికెట్ దేవుడు సచిన్.. ఆయన సతీమణి అంజిలి ఇద్దరూ హాజరు కావటం విశేషం. ఈ సినిమా పూర్తి అయిన అనంతరం భావోద్వేగంతో కదిలిపోయి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వటం గమనార్హం.

Sachin A Billion Dreams Film

క్రికెట్ కు సచిన్ చేసిన సేవలకు గాను ఆయన్ను గౌరవంగా గ్రూప్ కెప్టెన్ స్థానాన్ని కల్పించి సముచితంగా గౌరవించటం తెలిసిందే. ఈ స్క్రీనింగ్కు సచిన్ యూనిఫాంలో రావటం అందరిని ఆకట్టుకుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు ఎయిర్ చీఫ్ మార్షల్ ధనో విచ్చేశారు. సినిమా సాగుతున్నంత సేపు సచిన్.. సచిన్ అంటూ థియేటర్ మారు మోగింది. ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా కదిలించటం ఖాయమని చెబుతున్నారు.

- Advertisement -