నోటి దుర్వాసనకు చెక్‌ పెట్టండిలా..

191
- Advertisement -

ఉదయాన్నే బ్రష్ చేసుకున్నా చాలా మందికి నోటి దుర్వాశ మాత్రం అలాగే ఉంటుంది. వయసులో ఉన్న అబ్బాయిలకు ఇది మరీ ఇబ్బంది. గర్ల్‌ఫ్రెండ్‌కి ముద్దు పెట్టాలంటే ఈ వాసనకు ఏం ఎక్కడ అసహ్యించుకుంటోదనని భయం. అయితే బ్రష్ చేసిన తర్వాత ఈ చిట్కాలను పాటిస్తే దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది.

బ్రష్ చేసిన తర్వాత 50 సెం.మీ. దారాన్ని తీసుకుని చేతి వేళ్ల మధ్యలో ఉంచండి. రెండు వైపులా గట్టిగా పట్టుకుని ఆ దారాన్ని దంతాల మధ్యలో ఉంచి అటూఇటూ తిప్పాలి. ఇలా ప్రతీ దంతం మూలల్లో శుభ్రం చేయాలి. దీని వల్ల దంత మూలాల్లోని క్రిములు బయటకు పోవడమే కాదు, శుభ్రపడతాయి.
 How to Stop and Prevent Bad Breath
రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా బ్రష్ చేయాలి. ఉదయాన్నే దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దుర్వాసన పోగొట్టుకోవచ్చు. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా బ్రష్ చేసుకోవాలి. దీని వల్ల నోటి నుంచి అదనపు బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీంతో ఉదయం పూట బ్యాక్టీరియా ప్రభావం అంతగా ఉండదు. కాబట్టి తప్పనిసరిగా రాత్రి పడుకునే ముందు దంతాలను శుభ్రం చేసుకోవాలి.
How to Stop and Prevent Bad Breath
నాలుక బ్యాక్టీరియాను ఉత్పతి చేసే పొలం లాంటింది. ఇది నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. రోజూ బ్రష్ చేసిన తర్వాత నాలుకను శుభ్రంగా గీసుకోవాలి. కొందరు బ్రష్ చేసిన తర్వాత మౌత్‌వాష్ ఉపయోగిస్తారు. దీని వల్ల నోరు పొడిబారుతుంది. ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత మౌత్‌వాష్ వినియోగించవచ్చు. రాత్రిపూట మాత్రం మాత్‌వాష్‌తో శుభ్రం చేసుకుంటే నాలుక పొడిబారి దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాకు దోహదం చేస్తుంది.
   How to Stop and Prevent Bad Breath
సాధారణంగా ఎక్కువ మొత్తంలో నీరు తాగితే దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా అదుపులో ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు కూడా ద్రవ పదార్థాలను అధికంగా తీసుకుంటారు. దీనిలో నీరు ప్రధానమైంది. నోట్లో నీళ్లు వేసి పుక్కిల్లించినప్పుడు బ్యాక్టీరియా బయటకు వస్తుంది. దీని వల్ల దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా బయటకు పోతుంది.

- Advertisement -