Harishrao:ప్రజల కోసం చివరి వరకు పోరాడుదాం

15
- Advertisement -

మనం ఉద్యమ వీరులం కార్య శూరులం.. ఉద్యమానికి ఊపిరి లూదిన వాళ్ళం..పేగులు తేగే దాకా మన మాతృ భూమి కోసం కొట్లాడిన వాళ్ళం.. మనకు సత్తువ ఉంది.. సత్తా ఉంది ప్రతిపక్షంలో కూడా మన మట్టి మనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడుదాం అన్నారు హరీష్‌ రావు. తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌ పార్టీ నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడిన హరీష్..
నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమీక్ష కు పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ పేరు పేరునా అభినందనలు అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత నెల రోజులకే సమీక్ష, సన్నాహక సమావేశాలు ప్రారంభించాం … ఇది పదకొండో మీటింగ్.. ఇప్పటి దాకా జరిగిన అన్ని సమావేశాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువగా విలువైన సూచనలు వచ్చాయన్నారు.

కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది. పార్టీ మీ అభిప్రాయం మేరకే పని చేస్తుందిని.. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడినం.. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డాం
…మన పార్టీ స్థానం మారింది.. పాలన నుంచి ప్రతి పక్షానికి వచ్చాం.. అయినా అధైర్య పడాల్సిన అవసరం లేదు అన్నారు. ప్రజాస్వామ్యం లో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు ఉండనక్కర్లేదు… ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల కాలంలో ప్రభుత్వం మారడానికి ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదన్నారు. రాజస్థాన్ లో ఐదేళ్లకే ప్రభుత్వం మారింది.. ఛత్తీస్ ఘడ్ లో కూడా ఐదేళ్లకే మారింది..ఇట్లా ప్రభుత్వాలు మారడం దేశంలో కొత్తేమి కాదు అన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదు… ఐదేళ్ల లోపే ప్రజావ్యతిరేకతను మూట గట్టుకుని ఇంటికి పోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశంలో ఎక్కువ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలి… మన బడ్జెట్ ఎంత? 2 లక్షల 90 వేల కోట్లు.. బడ్జెట్ కన్నా మించి హామీలిచ్చారు.. ఎలాగూ అధికారం రాదు కదా అని అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టోను రాసేశారన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చింది.. ఎన్నికలపుడు ఇష్టమొచ్చిన విధంగా ప్రజలను మభ్యపెట్టి ఇపుడు వాటి గురించి మనం అడిగితే కాకమ్మ కథలు చెబుతున్నారు… హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారు.. కర్ణాటక లో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా మారిందన్నారు.

5 గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని కర్ణాటక ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి మొన్న మీడియా తో చెప్పారు… గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందని ఆయన హెచ్చరించారు. మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరం లో లేవు.. రాజకీయాలకతీతంగా కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం
– సాంప్రదాయ రాజకీయపద్ధతులకు కేసీఆర్ దూరంగా ఉన్నారు.. కొంత అది నష్టం చేసిందన్న భావన కార్యకర్తల్లో ఉందిన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం.. విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని.. ఈ కీలక సమయం లో బీఆర్ఎస్ ఎంపీ లు ఢిల్లీ లో లేకపోతే తెలంగాణ కు నష్టం అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేది పోయి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ లో ప్రతి రోజూ బీజేపీ నాయకుల మెడలకు దండలు వేస్తున్నారన్నారు. బండి సంజయ్ కాంగ్రెస్ బీజేపీల మైత్రిని బహిరంగంగా ఒప్పుకున్నారని, కేసీఆర్ అట కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటారని ఈ బ్రహ్మ జ్ఞాని బండి సంజయ్ సెలవిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీ దేనని బండి సంజయ్ చెబుతున్నారు… మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారన్నారు. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా ఉంది బండి సంజయ్ తీరు ఉందని, బండి సంజయ్ లొట్ట పిట్ట లా వార్తల్లో ఉండేందుకు తాపత్రయ పడతారన్నారు. కరీం నగర్ కు ఒక్క రూపాయి తెనోడు అడ్డమైన విషయాలు అడ్డం పొడువు మాట్లాడుతున్నాడని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం ప్రకటించి మనల్ని బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారన్నారు హరీష్.

Also Read:Ram Mandir:చంద్రబాబుకు ఆహ్వానం

- Advertisement -