ప్చ్.. చిన్న హీరో కాబట్టే, చిన్న చూపు

19
- Advertisement -

సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోన్న ‘హనుమాన్’ మూవీపై కన్నడ హీరోలు ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఏ తెలుగు హీరో చిన్న పాజిటివ్ కామెంట్ కూడా చేయలేదు. హీరో తేజాతో కలిసి మూవీ చూసిన కన్నడ సూపర్ స్టార్ శివన్న హనుమాన్ సినిమా సూపర్బ్‌గా ఉందన్నారు. అలాగే మరో కన్నడ హీరో రిషబ్ శెట్టి కూడా స్పందిస్తూ..’అన్ని ఎమోషన్లు హనుమాన్ మూవీలో ఉన్నాయని చెప్పారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ చెప్పిన విధానం అద్భుతంగా ఉందని ఈ కాంతార హీరో ట్వీట్ చేశారు. తేజా యాక్టింగ్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. పలువురు హిందీ వాళ్ళు కూడా సినిమా బాగుంది అంటూ కామెంట్స్ చేశారు.

మరి తెలుగు హీరోల మాటేమిటి?, ‘హనుమాన్’ మూవీపై కన్నడ హీరోల ప్రశంసలు కురిపిస్తున్నారు గానీ, తెలుగు స్టార్ హీరోలు మాత్రం నోరు కూడా విప్పడం లేదు. నిజంగా ఇది ద్వేషపూరిత వాతావరణమే. ఓ చిన్న తెలుగు హీరో విజయం సాధిస్తే.. పెద్ద మనసు చేసుకుని తమ సపోర్ట్ ను ఏ హీరో ఎందుకు ఇవ్వడం లేదు. అదే ఏ అక్కినేని అఖిలో.. లేక ఏ మెగా హీరోనే ఈ విజయం సాధిస్తే మరోలా ఉండేది పరిస్థితి. కానీ సక్సెస్ అందుకుంది ఎలాంటి సపోర్ట్ లేని చిన్న హీరో, అందుకే చిన్న చూపు. పోనీ తెలుగులో సక్సెస్ లు అందుకుంటున్న చిన్నాచితక హీరోలు అయినా ఈ హనుమాన్ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారా అంటే.. అదీ లేదు.

పైగా ప్రస్తుతం హనుమాన్ కి ఉన్న క్రేజ్ ను తమ సినిమాకి వాడుకోవాలని ఉబలాట పడుతున్నారు. ‘స్వయంభు’ సినిమాలో తాను హనుమాన్ భక్తుడిగా నటిస్తున్నట్లు హీరో నిఖిల్ చెబుతున్నాడు. పైగా తన మూవీని ఈ ఏడాది దసరా లేదా దీపావళికి విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం కొన్ని అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపాడు. ఏమిటో.. ఎప్పుడో రిలీజ్ కాబోయే తన సినిమా గురించి హీరో నిఖిల్ చెబుతున్నాడు గానీ, ఇప్పుడు హనుమాన్ సినిమా గురించి మాత్రం చిన్న మాట కూడా మాట్లాడటం లేదు.

Also Read:మహిళల్లో సంతాన సమస్యలు తగ్గాలంటే..?

- Advertisement -