ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మద్య జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు మూడో మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇక నేడు జరిగే చివరి మ్యాచ్ నామమాత్రమే అయినప్పటికీ ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నెలబెట్టుకోవాలని అఫ్గాన్ పట్టుదలగా ఉంది. టీమిండియా బ్యాట్స్ మెన్స్ లలో శివం దూబే గత రెండు మ్యాచ్ ల్లో అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అలాగే జైస్వాల్ కూడా తనదైన ఆటతీరుతో పర్వాలేదనిపించాడు. అయితే టీమిండియా స్టార్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గత రెండు మ్యాచ్ లో కూడా పూర్తిగా విఫలం అయ్యారు.
ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అసలు పరుగుల ఖాతానే తెరవకుండా నిరాశ పరుస్తూ వచ్చాడు. కనీసం చివరి మ్యాచ్ లో నైనా హిట్ మ్యాన్ చెలరేగుతాడా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ గత మ్యాచ్ లో 29 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్ లో కూడా చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా రోహిత్, కోహ్లీ ఫుల్ ఫామ్ లోకి రావడం చాలా ముఖ్యం. ప్రస్తుతం యువ ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తున్న వేల జట్టులో స్థానం సుస్థిరం గా ఉండాలంటే ఈ ఇద్దరు చెలరేగి ఆడక తప్పదు. మరి అఫ్గానిస్తాన్ తో జరుగుతున్నా ఈ చివరి మ్యాచ్ లో ఈ ఇద్దరి ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read:TTD:తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం