షర్మిల పదవిపై వీడని కన్ఫ్యూజన్?

23
- Advertisement -

వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతగా మారిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ షర్మిలను రంగంలోకి దించుతోంది. ఏపీలో 2014 తర్వాత కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైంది. అయితే ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కూడా పార్టీని బలపరిచేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. అందుకే ఏపీలో ఎంతో కొంత ప్రభావం చూపగల షర్మిలను పార్టీలో చేర్చుకుని అందరి దృష్టి కాంగ్రెస్ పై పడేలా చేసింది. అయితే ఆమెకు ఏ పదవి ఇవ్వాలనే దానిపై హైకమాండ్ ఇంకా తర్జన భర్జన పడుతున్నట్లు వినికిడి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాద్యతను షర్మిలా భుజాన పెడితే పార్టీని నష్టమా ? లాభామా ? అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మొదట ఏపీ రాజకీయాల్లో ఉన్న షర్మిల కుటుంబ వివాదాల కారణంగా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు..

తెలంగాణలో పార్టీ పెట్టి తాను తెలంగాణ బిడ్డను అంటూ ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. ఇంతలోనే మళ్ళీ కాంగ్రెస్ లో చేరడంతో ఆమెకు కీలక బాధ్యత అప్పగిస్తే పార్టీపై ప్రతికూల ప్రభావం ఉంటుందేమో అనే వాదన అరకొర వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలో పార్టీకి మైలేజ్ పెరగాలంటే షర్మిలనే కరెక్ట్ అనే భావన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఏ పదవి అప్పగిస్తారనే దానిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ కొత్త ఏపీసీసీ చీఫ్ ఎవరనే విషయంపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం షర్మిలనే ఆ పదవి వరించే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ అధిష్టానం షర్మిల వైపే చూస్తుందా ? లేదా ఇతరులకు ఛాన్స్ ఇస్తుందా అనేది చూడాలి.

Also Read:Congress:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా అద్దంకి,వెంకట్!

- Advertisement -