టీడీపీకి ఎన్టీఆర్ ఎఫెక్ట్ తప్పదా?

27
- Advertisement -

ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ప్రతిపక్ష టీడీపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అదినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. అధికార వైసీపీ పై విమర్శలు గుప్పిస్తూ ప్రజల దృష్టిని టీడీపీ వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో టీడీపీకి జూ.ఎన్టీఆర్ ఎఫెక్ట్ తగిలే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా జూ. ఎన్టీఆర్ అంశం టీడీపీ అగ్రనేతలను తరచూ ఇబ్బంది పెడుతూనే ఉంది, చంద్రబాబు, లోకేష్ నిర్వహించే బహిరంగ సభలలో జూ.ఎన్టీఆర్ అభిమానులు సి‌ఎం సి‌ఎం అంటూ నినాధాలు చేయడం, జూ. ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించాలని గోల చేయడం వంటివి చేస్తూ వస్తున్నారు. .

తాజాగా చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభలో ఏకంగా టీడీపీ శ్రేణులు మరియు జూ. ఎన్టీఆర్ అభిమానులు పరస్పర ఘర్షణలకు కూడా పాల్పడ్డారు. దీంతో ఇప్పుడు టీడీపీ వర్సెస్ జూ. ఎన్టీఆర్ అంటూ పోలిటికల్ హీట్ రాజుకుంది. చంద్రబాబు తారక్ ను కావాలనే దూరం చేస్తున్నాడని, టీడీపీలో జూ. ఎన్టీఆర్ ప్రస్తావనే లేకుండా చంద్రబాబు కఠినంగా వ్యవహస్తున్నాడనే చర్చ జరుగుతోంది. తాజాగా జరిగిన ఘర్షణను విమర్శనాస్త్రంగా వైసీపీ నేతలు చంద్రబాబుపై సందిస్తున్నారు. వైసీపీ నేత మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేస్తూ ” ఎన్టీఆర్ ( సీనియర్ )కు జోహార్లు, జూనియర్ కు అవమానాలు.. ఇది నారా పన్నాగం అంటూ ట్వీట్ చేశారు. ఇలా జూ. ఎన్టీఆర్ అంశం ఎన్నికల ముందు మరింత రాజుకుంటే టీడీపీకి ఇబ్బందులు తప్పవనేది కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట. మరి జూ. ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ముందు రోజుల్లో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

Also Read:ఈ చిట్కాలు పాటిస్తే..ఆ సమస్యలన్నీ దూరం!

- Advertisement -