మీ పేరుతో ఉన్న సిమ్ కార్డులను.. గుర్తించండిలా!

33
- Advertisement -

నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ మొబైల్ లో సిమ్ కార్డు ఉండటం సర్వసాధారణం. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సిమ్ కార్డు అనేది గుర్తింపు గా మారింది. ఎవరికైనా కాల్ చేయడానికి, లేదా బ్యాంకింగ్ లావాదేవీలను జరపడానికి, ఇతరత్రా అవసరాలకు సిమ్ కార్డు అనేది తప్పనిసరి. అయితే కొందరు ఒక సిమ్ కార్డ్ తో ఒకే నెంబర్ ను మెంటైన్ చేస్తుంటారు. మరికొందరు తరచూ మొబైల్ నెంబర్ మారుస్తూ ఎప్పటికప్పుడు కొత్త సిమ్ కార్డును తీసుకుంటూ ఉంటారు. .

అయితే సిమ్ కార్డ్ తీసుకోవాలంటే ఆధార్ సమాచారం ఇవ్వడం తప్పనిసరి. అయితే మన ఆధార్ డేటా తో మనకు తెలియకుండానే వేరొకరు సిమ్ కార్డ్ తీసుకొని నేరాలకు పాల్పడుతుంటారు. వారి కారణంగా ఆధార్ డేటాలో ఉన్నవారు కూడా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసమే అలాంటి నేరాలకు చెక్ పెట్టేందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. మీ యొక్క ఆధార్ డేటాతో వేరొకరు మీ ప్రమేయం లేకుండా సిమ్ కార్డులు తీసుకుంటే వాటిని వెంటనే డియాక్టివేట్ చేసే సౌలభ్యం తీసుకొచ్చింది. అదెలాగో చూద్దాం.

.*ముందుగా tafcop.sancharsaathi.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి.
* ఆ తరువాత మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ని అక్కడ ఎంటర్ చేసి క్లిక్ చేయాలి.
* అక్కడ మీ నెంబర్ కాకుండా మీ సమాచారంతో కలిగి ఉన్న ఇతర నెంబర్లు ఉంటే చూపిస్తుంది. అందులో మీకు సంబంధం లేని నెంబర్ ఉన్నట్లైతే వెంటనే అక్కడే ఉన్న రిపోర్ట్ క్లిక్ చేస్తే ఆ నెంబర్ బ్లాక్ అవుతుంది.

ఇలా మీ సమాచారంతో మీ ప్రమేయం లేని సిమ్ కార్డులను బ్లాక్ చేయవచ్చు.

Also Read:ఉద‌యాన్నే వాట‌ర్ తో ఉపయోగాలు?

- Advertisement -