పాలు అనేవి అత్యధిక పోషకాలు కలిగి ఉన్న బలవర్ధకమైన పదార్థం. అందుకే ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు తాగాలని ఆహార నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే పాలలో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. అలాగే కాల్షియం, మాంగనీస్, విటమిన్స్, మినరల్స్.. ఇలా మన శరీరానికి అవసరమైన ప్రతిదీ కూడా మెండుగా లభిస్తుంది. అయితే పాలు షుగర్ వ్యాధిగ్రస్తులు తగవచ్చా ? అనే డౌట్ చాలమందిలో ఉంటుంది. ఎందుకంటే పాలలో ఉండే లాక్టోజ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతుందనే భయం చాలమందిలో ఉంది. అందుకే షుగర్ పేషెంట్లు పాలకు దూరంగా ఉంటారు. అయితే పాలు తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి ముప్పు ఉండదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇంకా పాలలో ఉండే ఆయా పోషకాలు టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేకూరుస్తాయట.
ఒక గ్లాస్ పాలలో కొద్దిగా పసులు కలుపుకుని తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయట. ఎందుకంటే పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలకం పాలతో కలిసినప్పుడు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా పాలలో దాల్చిన చెక్క కలిపి తగిన మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలేనట. దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంగ్లమెంటరీ గుణాలు షుగర్ ను అదుపులో ఉంచుతాయి. కాబట్టి ప్రతిరోజూ పాలతో పాటు దాల్చిన చెక్క, తేనె లేదా పసుపు వంటివి కలుపుకొని త్రాగితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి ముప్పు ఉండదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా ప్రతిరోజూ పాలు తాగడం వల్ల విటమిన్ డి, ఇ.. ఫైబర్ కంటెంట్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.
Also Read:KCR:సమానత్వమే ఫూలే విధానం