REWIND 2023 : క్రీడల్లో సత్తా చాటిన భారత్!

35
- Advertisement -

ఈ ఏడాది క్రీడల పరంగా భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఆట ఏదైనా అంతర్జాతీయ సత్తా చాటుతూ వచ్చింది. ఈ ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ ఏకంగా 107 సాధించి గుర్తుండిపోయే ప్రదర్శన ఇచ్చింది. చెస్ వరల్డ్ కప్ లో భారత్ కు చెందిన ప్రజ్ఞానంద రెండో స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక క్రికెట్ విషయానికొస్తే ఈ ఏడాది టీమిండియా గతంలో ఎన్నడూ లేని అత్యుత్తమ ప్రదర్శనతో తిరుగులేని జట్టుగా నిలిచింది. అంతర్జాతీయ మెగా టోర్నీ లన్నిటిలో కూడా టీమిండియా సత్తా చాటుతూ వచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీలో ఫైనల్ లో ఓటమి చవి చూసినప్పటికి జట్టు ప్రదర్శన మాత్రం అందరినీ ఆకర్షించింది. ఇక ఇదే ఏడాది జరిగిన ఆసియా కప్ సత్తా చాటడంతో పాటు కప్పు కూడా సొంతం చేసుకుంది. .

ఇక వన్డే వరల్డ్ కప్ విషయానికొస్తే లీగ్ దశ నుంచి ఓటమి ఎరుగని జట్టుగా వరుస విజయాలను సాధిస్తూ వచ్చిన టీమిండియా ఫైనల్ లో మాత్రం ఓటమి చవి చూసి రన్నరప్ గా నిలిచింది. అయినప్పటికి జట్టు సమిష్టి ప్రదర్శన అందరినీ అలరించింది. ఇక గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్నీ ఫార్మాట్ల ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ నెంబర్ ఒన్ గా నిలుస్తూ వచ్చింది. ఆటగాళ్ల పరంగా కూడా ఆటగాళ్ల పరంగా కూడా టీమిండియా ప్లేయర్సే అగ్రస్థానంలో ఉండడం హర్షించాల్సిన విషయం. వన్డే ఐసీసీ ర్యాంకింగ్స్ లో శుబ్ మన్ గిల్ ఉండగా, బౌలర్స్ లలో మహ్మద్ సిరాజ్ అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చారు. ఇక టీ20 లలో సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్ లో ఉండగా అల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా టాప్ లో కొనసాగారు. ఇలా ఈ ఏడాది టీమిండియా గతంలో ఎప్పుడు లేని విధంగా అన్నీ విభాగాల్లో టాప్ లో కొనసాగుతూ వచ్చింది. మొత్తానికి క్రీడల పరంగా ఈ ఏడాది భారత్ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

Also Read:ఈ-చలాన్..సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త

- Advertisement -