కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చిఇరవై ఐదు రోజుల పైనే అవుతుం….పథకాలు ఎపుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తుంటే అప్పులు అప్పులు అని పాడిందే పాడుతున్నారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి…అసెంబ్లీ లో శ్వేత పత్రాలు పెట్టారు మేము సమాధానం చెప్పాం అన్నారు. డిప్యూటీ సీఎం ,విద్యుత్ శాఖ మంత్రి భట్టి జిల్లా పర్యటనలో అవే అప్పుల గురించి చెబుతున్నారు ..మేము ప్రతిదీ అంకెలు అంకెలు తేట తెల్లంగా చెప్పాం అన్నారు. కరెంటు రంగం లో మేము సాధించిన ప్రగతి ఇప్పటికే వివరించామని….అప్పు లేని రాష్ట్రాలు దేశం లో ఉన్నాయా ..దేశానికి కూడా అప్పు ఉందన్నారు. మొన్నటి దాకా కాంగ్రెస్ ఏలిన రాజస్థాన్ లో 89 వేల కోట్ల రూపాయల అప్పుల్లో విద్యుత్ సంస్థలు ఉన్నాయన్నారు.
ప్రతిపక్షం లో మా అప్పుల గురించి చెప్పారు ..ఇపుడు అదే చెబుతున్నారు..దేశం లో విద్యుత్ సంస్థలు అన్నీ అప్పులు ,నష్టాల్లోనే ఉన్నాయన్నారు. .అప్పు చేశామో ఏం చేశామో ప్రజలకు మేము కరెంటు కష్టాలు లేకుండా చేశామని….పాలన చేత కాక కాంగ్రెస్ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. మేనేజ్ మెంట్ చేతకాక అప్పుల గురించి మాట్లాడుతున్నారని…..2014 విద్యుత్ రంగం లో మీరు మిగిల్చిన అప్పు 22 వేల కోట్లు ..అయినా 3 గంటలు కరెంటు ఇవ్వలేక పోయారన్నారు.
భద్రాద్రి పవర్ ప్రాజెక్టు సబ్ క్రిటికల్ టెక్నాలజీ గురించి భట్టి పదే పదే మాట్లాడుతున్నారని…..సబ్ క్రిటికల్ టెక్నలజీ ని ఇప్పటికీ కూడా 30 కి పైగా విద్యుత్ ప్రాజెక్టు లు నడుస్తున్నాయన్నారు. చట్టం లోనే తర్వాత సబ్ క్రిటికల్ టెక్నాలజీ ని మార్చుకోవచ్చని ఉంది ..మేము ఫాలో అయ్యాం..గతం లో ఇదే విషయాన్ని అసెంబ్లీ లో చెప్పామన్నారు. భట్టి లేని సమస్యను పెద్దదిగా చూపే ప్రయత్నము చేస్తున్నారు
..దేశం లో 24 గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు…..నిన్న మేడి గడ్డలో మంత్రులు మంత్రుల్లాగా కాదు రౌడీ ల్లా మాట్లాడారన్నారు.
Also Read:ప్రియమైన వారి ‘లైఫ్ లొకేషన్’ తెలుసుకోండిలా!