నెలసరి టైమ్ లో దుర్వాసన.. జాగ్రత్త!

29
- Advertisement -

మహిళల్లో సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ రుతుక్రమం. ఈ నెలసరి టైమ్ లో ఎన్నో ఇబ్బందులను మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు. పొత్తి కడుపులో నొప్పి, తల తిప్పడం, అలసట, చికాగు.. ఇలా ఎన్నో సమస్యలు వారిని చుట్టుముడతాయి. అయితే ఈ సమస్యలు సాధారణమే అయినప్పటికి. కొన్నిటి విషయంలో మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నెలసరి వచ్చినప్పుడు దుర్వాసన అధికంగా ఉంటే మహిళలు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత డాక్టర్ ను కలవడం మంచిదట. ఎందుకంటే దుర్వాసన అధికంగా ఉంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది. అందువల్ల పీరియడ్స్ టైమ్ లో బ్లిడింగ్ అధికంగా ఉన్నా, ఒకరకమైన దుర్వాసన వచ్చిన ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. .

ఇంకా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం, ఆకుపచ్చ లేదా పసుపు రంగులో స్రావాలు విడుదల కావడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే గైనకాలజిస్ట్ లను సంప్రదించడం మంచిది. అయితే పీరియడ్స్ టైమ్ లో ధరించే ప్యాడ్స్ కారణంగా కూడా దుర్వాసన వస్తుంది. ఎందుకంటే ప్యాడ్స్ లో వాడే రసాయనాల కారణంగా వాటితో రక్తం కలిసినప్పుడు దుర్వాసనకు కారణమౌతుంది. కాబట్టి నెలసరి టైమ్ మహిళలు ప్యాడ్స్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా నెలసరి సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. లో దుస్తులను శుబ్రంగా ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు ప్యాడ్స్ ను మార్చుకోవడం చేయాలి. లేదంటే అలర్జీ, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి నెలసరి టైమ్ లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:ఈటలను బీజేపీ నుంచి గెంటేస్తున్నారా?

- Advertisement -