2023లో పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు వారి కుటుంబ సభ్యులను కోల్పోయిన ఘటనలు చూశాం. ఇప్పుడు సౌత్ సినీ పరిశ్రమలో వరుసగా తీవ్ర విషాదాలు నెలకొన్నాయి. ప్రముఖ హీరో, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ కాసేపటి క్రితం చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చివరకు కొవిడ్ పాజిటివ్ కారణంగా చనిపోయారు. అలాగే కన్నడ చిత్ర పరిశ్రమలోనూ మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ పైట్ మాస్టర్ జాలీ బాస్టియన్ (57) కన్నుమూశారు.
బెంగళూరులోని తన ఇంట్లో ఆయన నిద్రలోనే గుండెపోటుతో మరణించారు. జాలీ దాదాపు 900 చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేశారు. ఆయన ఎక్కువగా కన్నడ సినిమాలకు పనిచేశారు. తెలుగులో అన్నయ్య, నక్షత్రం మూవీలు చేశారు. రిస్క్‌తో కూడుకున్న ఫైట్స్ కంపోజ్ చేయడంలో జాలీ బాస్టియన్‌కు ఎంతో పేరుంది. ఆయన స్వస్థలం కేరళలోని అలెప్పీ. 900 చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. 2009లో నినగాగి కాదిరువు అనే చిత్రంతో దర్శకుడిగా మారారు.
అలాగే, టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్ గాయత్రి భార్గవి తండ్రి సూర్య నారాయణ శర్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. యాంకర్ గా గాయత్రి భార్గవికి మంచి పేరు ఉంది. అదేవిధంగా నటిగానూ గాయత్రీ భార్గవి సినిమాల్లో రాణించారు. ఏది ఏమైనా ఇలా సౌత్ సినీ పరిశ్రమలో ఇలా వరుసగా విషాదాలు జరగడం బాధాకరమైన విషయం.
Also Read:అఫ్గాన్ టూర్ లో కెప్టెన్ ఎవరు ?