వావ్.. దేవర టీజర్ అదిరిపోయిందట

32
- Advertisement -

ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మూవీ దేవర. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దీనికి సంబంధించి అనిరుద్ ఓ ట్వీట్ చేశారు. దేవర టీజర్ అదిరిపోయింది. దేవర మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంటుందని ట్వీట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి ఫీల్ అవుతున్నారు. సహజంగా అనిరుద్ ఇలాంటి ట్వీట్స్ అరుదుగా చేస్తుంటాడు. సినిమాలో మ్యాటర్ ఉంటేనే అనిరుద్ ఇలా రియాక్ట్ అవుతుంటాడు. అలాంటి అనిరుద్ కూడా దేవర టీజర్ పై పాజిటివ్ కామెంట్స్ చేశాడంటే.. సినిమాలో సాలిడ్ మ్యాటర్ ఉందని అర్ధం.

ఎంతైనా ‘ఆర్ఆర్ఆర్’ త‌ర్వాత ఎన్టీఆర్, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా దేవ‌ర‌. కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచాలను అందుకోవాలి అంటే.. అదిరిపోయే కంటెంట్ ఉండాలి. అందుకే, దర్శకుడు కొరటాల శివ కూడా ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు క‌ళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా డెవిల్ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటున్న క‌ళ్యాణ్ రామ్, దేవ‌ర సినిమా షూటింగ్ 80% పూర్త‌యిన‌ట్లు తెలిపాడు. విఎఫ్ఎక్స్ వ‌ర్క్స్ అనుకున్న‌ట్లు టైమ్ కు పూర్తైతే గ్లింప్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని క‌ళ్యాణ్ రామ్ వెల్ల‌డించాడు.

అన్నట్టు దేవర సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ ఓ ప్ర‌ముఖ సంస్థ‌కు లాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఓటీటీ దిగ్గ‌జ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. దేవ‌ర వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం స‌లార్ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్ర‌శాంత్ నీల్.. త్వ‌ర‌లోనే త‌న త‌ర్వాతి సినిమాపై దృష్టి పెట్ట‌నున్నాడ‌ట‌. ప్ర‌శాంత్ నీల్ త‌ర్వాతి మూవీని ఎన్టీఆర్‌తో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. స‌లార్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న నీల్, ఎన్టీఆర్ మూవీతో ఆ క్రేజ్‌ను మ‌రింత పెంచుకోవాల‌ని, ఇప్ప‌టినుంచే ఆ సినిమా కోసం క‌స‌ర‌త్తులు చేయ‌నున్నాడ‌ట‌.

Also Read:ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు!

- Advertisement -