అద్భుత పనితీరుతో తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. హెచ్‌ఐసీసీలో ఎస్సై నుంచి డీజీపీ స్ధాయి వరకు హాజరైన పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చేసిన ఉపన్యాసాలు మీరు విన్నారు, ఎవరూ ఊహించని రాష్ట్రం కష్టపడి సాధించాం. ఆ లక్ష్యాలు నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కీలకమైన వ్యవస్త అన్నారు. రాష్ట్ర సాధనలో పోలీసుల పాత్ర ప్రాముఖ్యమైందన్నారు.
హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి నాయకత్వంలో నగర పోలీసులు మరింత సమర్థంగా పని చేస్తున్నారని ప్రశంసించారు సీఎం . మరోవైపు పౌరసరఫరాల శాఖలో సీవీ ఆనంద్ కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు. ఆయన పనితీరుతో ప్రభుత్వానికి రూ.850 కోట్లు ఆదా అయ్యాయి అన్నారు. పోలీసులు శాంతి భద్రతలను సమగ్రంగా పరిరక్షించడం వల్లే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారన్నారు.
షీ టీమ్స్ కూడా అద్భుతంగా పని చేస్తున్నాయన్నారు. షీటీమ్స్ ను విజయవంతం చేసిన ఘనత ఐపీఎస్ స్వాతి లక్రాకే దక్కుతుందన్నారు సీఎం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు అధికార పార్టీ గెలిచిందంటే.. ఆ ఘనత పోలీసులది కూడా అన్నారు. టీఆర్ఎస్ నాయకులు పోలీసుల పేరు చెప్పి గెలిచారు. ఆటోలపై షీటీమ్స్, పోలీసింగ్ కు సంబంధించిన విషయాలతో ప్రచారం నిర్వహించారంటే.. హైదరాబాద్ పోలీసుల పనితీరు ఎంత బాగుందో చెప్పొచ్చు అన్నారు.
ఎస్సై, సీఐ ఎప్పుడూ అప్‌డెట్ అయి ఉండాలన్నారు. నేను చెప్పేది రైట్ అని మీరంటారనుకుంటానని సీఎం అన్నారు. జోన్ల సమస్యను స్ట్రీమ్‌లైన్ చేయాలన్నారు. డిపార్ట్‌మెంట్ హెడ్స్‌కు ప్రమోషన్ తప్పక ఇవ్వాలన్నారు. ప్రమోషన్ తగిన సమయానికి ఇస్తే అదే బెస్ట్ రిఫార్మ్ అవుతుందన్నారు. అలా చేస్తే డ్యూటీ గురించి ఆలోచించాల్సిన ఇబ్బంది ఉండదన్నారు. ప్రమోషన్ల అంశంపై ప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. రిటైర్ అయ్యే పోలీసులకు అన్ని అవసరాలు కల్పించాలన్నారు. పెన్షన్ అర్హత ఉన్నవారు, పైరవీలకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. రిటైర్ అయ్యే పోలీసుల పెన్షన్ ప్యాక్ ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలన్నారు. పదవీ విమరణ చేసిన పోలీసులను సకల మర్యాదలతో సాగనంపాలన్నారు. మహిళా పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
పోలీసు శాఖకు 500 కోట్ల బహూమానం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. కొత్త వాహనాలు, మౌళిక సదుపాయాల కోసం ఆ డబ్బును ఖర్చు చేయాలన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం నక్సలైట్ల మయం అవుతుందని, లా అండర్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉండదని ఆరోపణలు వచ్చాయని, మన మీద రకరకాల ప్రచారం చేశారన్నారు. అటాంటి ఆరోపణలను అన్నింటిని పటాపంచలు చేసిన పోలీసులకు దక్కుతుందన్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని, హోంమంత్రి వెళ్లిన సందర్భంలో వాళ్లు ప్రశంసించారు. తెలంగాణ పోలీసులు గొప్పపని, యంగెస్ట్, గ్రేటెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా అని మన పోలీసులను దేశవ్యాప్తంగా కీర్తిస్తున్నారని సీఎం అన్నారు. తెలంగాణ పోలీసులు సాధిస్తున్న ఘనత పట్ల సంతోషంగా ఉందని, వారందరికీ హృదయాపూర్వకంగా అభినందనలు తెలిపారు.
తెలంగాణ పోలీసులు అద్భుతంగా పేనిచేస్తున్నారు. ఈ పనితీరు ఇంకా మెరుగు కావాలన్నారు. ఎప్పుడూ రిలాక్స్ కారాదన్నారు. బెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ చాలా ముఖ్యమైందన్నారు. ఓ దశ తర్వాత మరో దశ అనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. డీజీపీ, హోంమంత్రి కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.