KTR:రైతులపై కాంగ్రెస్ కు చిన్నచూపా?

33
- Advertisement -

రైతులను కాంగ్రెస్ చిన్నచూపు చూస్తోందా ? కర్ణాటక కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నిజమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ కోసం రైతులు కరువు కోరుకుంటారని, ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఆత్మహత్యలు చేసుకుంటారని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుండడాన్ని చూస్తే వారు రైతులపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద్ పాటిల్ రైతులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెళగావిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతూ ‘ రైతులకు కరెంటు, నీరు ఉచితంగా లభిస్తున్నందున రుణమాఫీ కోసం రియాతులు కరువు రావాలని కోరుకుంటున్నట్లు.. ‘ వ్యాఖ్యానించారు. .

దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై రైతు సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రుణమాఫీ హామీ ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేని ప్రభుత్వాలు రైతులను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటు అని రైతు సంఘాలు ఫైర్ అవుతున్నాయి. గతంలో కూడా శివానంద్ పాటిల్ రైతులపై ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. ‘ రైతు ఆత్మహత్య చేసుకుంటే పరిహారంగా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం రూ 5 లక్షలకు పెరిగిన తరువాత ఆత్మహత్యల శాతం మరింత పెరిగిందని గతంలో కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు.

ఇక తాజాగా రైతులపై శివానంద్ చేసిన వ్యాఖ్యలపై బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ ట్విట్టర్ (ఎక్స్) లో ఘాటుగా స్పందించారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతులు కరువును కోరుకోరని మంత్రి హోదాలో ఉన్న శివానంద్ పాటిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న మంత్రి శివానంద్ వ్యాఖ్యలు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి.
https://twitter.com/KTRBRS/status/1739220119723684288?s=20
- Advertisement -