BRS:లోక్ సభ ఎన్నికలపై కే‌సి‌ఆర్ ఫోకస్?

34
- Advertisement -

బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కే‌సి‌ఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు గాను గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ 9 సీట్లు గెలుచుకోగా బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఏంఐఏం 1 సీట్లు సాధించాయి. ఈసారి ఎవరిది పై చేయిగా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీతోనే బి‌ఆర్‌ఎస్ కు అధిక పోటీ ఉంటుందని బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున అవాంఛిత కార్యక్రమాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు.

అందుకే పార్టీ కార్యకర్తలంతా ప్రణాళిక బద్దంగా పని చేయాలని కే‌టి‌ఆర్ సూచించారు. ఇక జనవరి 3 నుంచి తెలంగాణ భవన్ లో లోక్ సభ ఎన్నికల దృష్ట్యా వరుస సమావేశాలు ఉండబోతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఈసారి లోక్ సభ ఎన్నికలపై బి‌ఆర్‌ఎస్ మరింతగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే సీట్ల కేటాయింపులో ఈసారి అధినేత కే‌సి‌ఆర్ ఎలా అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ లకే అధిక సీట్లు కేటాయిస్తారా లేదా కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ఓటమి లోక్ సభ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే కేవలం 1-2 శాతం ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ విజయం సాధించిందని, రాష్ట్రంలో మజారిటీ ప్రజలు బి‌ఆర్‌ఎస్ వెంటే ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నా మాట. అందువల్ల లోక్ సభ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:షారుఖ్ రికార్డులే ‘ సలార్ ‘ టార్గెట్?

- Advertisement -