TTD:సంతృప్తిక‌రంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

31
- Advertisement -

వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తులు సంతృప్తిక‌రంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకున్నార‌ని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశామ‌ని టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తెలిపారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ఎదుట శ‌నివారం ఉద‌యం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌న్నారు. భ‌క్తులంద‌రికీ వైకుంఠ ఏకాద‌శి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా భ‌క్తులంద‌రికీ శ్రీ‌వారి ఆశీస్సులు క‌ల‌గాల‌ని ఆకాంక్షించారు.

టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ నిర్దేశిత‌ స‌మ‌యం కంటే 45 నిమిషాలు ముందుగా శ‌నివారం ఉదయం 5.15 గంటల నుండే సర్వదర్శనం ప్రారంభించామని తెలిపారు. ఆ త‌రువాత స్లాట్ల వారీగా ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను అనుమ‌తిస్తున్నామ‌ని తెలియ‌జేశారు. క్యూలైన్ల‌లో ఉన్న భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, టీ, కాఫి, పాలు అందిస్తున్నామ‌ని చెప్పారు. 10 రోజుల్లో క‌లిపి దాదాపు 8 ల‌క్ష‌ల మందికి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు.

Also Read:CPI Narayana:బీజేపీతో తెలుగు రాష్ట్రాలకు నష్టం

- Advertisement -