మహేష్ అంటే బాగా ఇష్టమట!

37
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబుకి లేడీస్ లోనే కాదు, హీరోయిన్స్ లో కూడా ఫుల్ క్రేజ్ ఉందనేది నిజం. మహేష్ పై హీరోయిన్లు కూడా మోజు చూపిస్తూ ఉంటారు. మొన్నటికిమొన్న హిందీ బ్యూటీ శ్రద్ధా కపూర్, తన మనసులో మాట బయటపెట్టింది. సౌత్ లో మహేష్ బాబు అంటే ఇష్టమని, అతడితో కలిసి నటించాలని ఉందంటూ తన కోరికను వెల్లడించింది. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కూడా అదే మాట చెబుతోంది. తన ఫేవరెట్ కో-స్టార్ మహేష్ బాబు అని, ఆయన లుక్స్ తో పాటు ఆయన నటన కూడా తనకు బాగా నచ్చుతుంది అని చెబుతోంది.

ఐతే, “ఫేవరెట్ కోస్టార్ ఎవరని అడిగితే మాత్రం తనకు టెన్షన్ వచ్చేస్తుంది అంటుంది కృతి సనన్. అసలు ఇలాంటివి చెప్పడం చాలా కష్టం అట. అలా అడగడం కరెక్ట్ కాదు. అందరూ నాకిష్టమే. ఒక్కర్నే సెలక్ట్ చేసుకోమంటే మాత్రం మహేష్ బాబు, షారుఖ్ ఖాన్ పేర్లు చెబుతాను’ అని మొత్తానికి కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది. ఇలా మహేష్ బాబుతో పాటు షారుఖ్ అంటే కూడా తనకు ఇష్టమనే విషయాన్ని చెప్పుకొచ్చింది కృతి సనన్. నిజానికి కృతి సనన్ ఇలా చెప్పడం ఇదే తొలిసారి కాదు. మహేష్ అంటే తనకు ఇష్టమని, అతడితో నటించినప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటానని గతంలోనే వెల్లడించింది.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకున్న అతికొద్ది ఫ్రెండ్స్ లో షారుఖ్ ఖాన్ ఒకడని కూడా కృతి సనన్ వెల్లడించింది. ఆ ఫ్రెండ్ షిప్ వల్లనే షారుఖ్ ఖాన్ తో రెగ్యులర్ గా మీట్ అవుతాను చెప్పింది. ఇప్పుడు మరోసారి షారుఖ్ ఖాన్ పై తన అభిమానాన్ని చాటుకుంది. ప్రస్తుతం ‘ది క్రూ’ సినిమాతో పాటు మరో థ్రిల్లర్ మూవీ చేస్తున్నకృతి సనన్, ఈ రెండు సినిమాల్లో చేస్తున్న పాత్రలే తన కెరీర్ లో ఛాలెంజింగ్ రోల్స్ అని చెప్పుకొచ్చింది. అటు ఇష్టమైన హాలిడే స్పాట్ పై స్పందిస్తూ, బాలి అంటే చాలా ఇష్టమని, ఎన్నిసార్లయినా అక్కడకు వెళ్లడానికి సిద్ధమని కృతి సనన్ తెలిపింది.

Also Read:నో డైటింగ్..బరువు తగ్గెందుకు సింపుల్ చిట్కాలు!

- Advertisement -