చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్-10 ఎలిమినేటర్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. కలకతా బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి సన్‌రైజర్స్ ఓపెనర్లు ఇబ్బంది పడ్డారు. ఉమేశ్ యాదవ్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన ఓపెనర్ శిఖర్ ధావన్ (11; 13 బంతుల్లో 1×4) ఔటయ్యాడు. అనంతరం విలియమ్సన్, డేవిడ్ వార్నర్‌లు పరుగులు తీయడానికి ఇబ్బందుల పడ్డారు. మూడు బంతుల వ్యవధిలోనే కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ వికెట్లను తీసిన కోల్‌కతా.. సన్‌రైజర్స్‌ను భారీ దెబ్బకొట్టింది. కౌల్టర్‌నైల్ బౌలింగ్‌లో విలియమ్సన్(24: 26 బంతుల్లో 2×4, 1×6) సూర్యకుమార్ యాదవ్ చేతికి చిక్కగా.. పియూశ్ చావ్లా బౌలింగ్‌లో వార్నర్(37: 35 బంతుల్లో 2×4, 2×6) బౌల్డయ్యాడు. 16వ ఓవర్లో నాలుగో వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ వేసిన ఆ ఓవర్ మూడో బంతిని యువరాజ్ సింగ్(9) భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద పియూష్ చావ్లా క్యాచ్ అందుకున్నాడు. విజయ్ శంకర్(22), నామన్ ఓజా(16), జోర్డన్(9)లు తక్కువ స్కోరుకే ఔటవ్వడంతో సన్‌రైజర్స్ 128 పరుగులు చేయగలిగింది..
తడబడ్డ సన్‌రైజర్స్.. కోల్‌కతా లక్ష్యం 129
- Advertisement -
- Advertisement -