IND VS SA:భారత్ పై విక్టరీ!

40
- Advertisement -

సౌతాఫ్రికా మరియు టీమిండియా మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ లో సఫారీ జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియాపై పైచేయి సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 ఓవర్లలో 211 పరుగులు చేసి ఆలౌట్ గా నిలిచింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా కేవలం 46 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ 1-1 తో సమంగా నిలిచింది. టీమిండియా బ్యాట్స్ మెన్స్ లో సాయి సుదర్శన్ (62), కే‌ఎల్ రాహుల్ (56) పరుగులతో రాణించినప్పటికి మిగిలిన బ్యాట్స్ మెన్స్ పెద్దగా స్కోర్ చేయకపోవడంతో టీమిండియా తక్కువ స్కోర్ కే పరిమితం అయింది.

ఆ తర్వాత లక్ష్య చేధనలో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ టోని జార్జీ (119) అద్భుతమైన సెంచరీ చేసి ప్రోటీస్ జట్టు విజయానికి బాటలు వేశాడు. ఇక అతనికి తోడు హెన్డ్రిక్స్ (52) హాఫ్ సెంచరీతో రాణించి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక రెండో వన్డేలో ప్రోటీస్ జట్టు విజయం సాధించడంతో 21 న జరిగే మూడో వన్డే డూ ఆర్ డై గా మారనుంది. ఇటీవల జరిగిన టీ20 సిరీస్ సమం కావడంతో కనీసం వన్డే సిరీస్ అయిన సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. మరి విజయం ఏ జట్టు ను వరిస్తుందో చూడాలి. ఇక వన్డే సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ లు కూడా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పాల్గొననున్నారు.

Also Read:బ్రేకింగ్..ట్రంప్‌కు బిగ్ షాక్

- Advertisement -