చలికాలంలో చేపలు తినడం మంచిదేనా?

78
- Advertisement -

మాంసాహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలలో చేపలు ముందు వరుసలో ఉంటాయి. ఇవి సీజన్ తో సంబంధం లేకుండా మార్కెట్లో నిత్యం లభిస్తూనే ఉంటాయి. చేపలతో రకరకాల వంటలు చేసుకొని కడుపు నిండ అరగిస్తూ ఉంటాము. వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు చేపలు తింటే ఆరోగ్యనికి ఎంతో మేలని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో చేపలు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట ఎందుకంటే ఇందులో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. ఫలితంగా గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. .

తద్వారా ఎలాంటి గుండె సమస్యలు దరి చేరవు. ఇక చలికాలంలో చాలమందికి డి విటమిన్ లోపిస్తుంది. అయితే చేపలలో డి విటమిన్ మెండుగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్ లో చేపలు తింటే విటమిన్ డి లోపించకుండా జాగ్రత్త పడవచ్చు. ఇవే కాకుండా చేపలు తినడం వల్ల ఇంకా చాలానే ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా చేపలలో ఉండే ఏమైనో ఆసిడ్స్ కండరాలను బలంగా మార్చడంలో సహాయ పడతాయి. అలాగే కంటి సమస్యలను దూరం చేయడంలో కూడా చేపలలో ఉండే పోషకాలు ఉపయోగ పడతాయి. ఇంకా చలికాలంలో తరచూ వేధించే కీళ్ల నొప్పులు తగ్గాలంటే చేపలు తప్పనిసరిగా తినాలని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే అమైనో యాసిడ్ కీళ్ల నొప్పులను దూరం చేసి రోగ నిరోధక శక్తి పెంచుతుందట. కాబట్టి చలికాలంలో చేపలు తినడం చాలా మంచిదని చెబుతున్నారు ఆహార నిపుణులు.

Also Read:యాక్ష‌న్ థ్రిల్ల‌ర్..‘భగీర’

- Advertisement -