Review 2023:ఈ ఏడాది రీమేక్ మూవీస్ ఢమాల్!

58
- Advertisement -

ఈ ఏడాది రీమేక్ మూవీస్ కు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. స్టార్ హీరోలు రీమేక్ మూవీస్ లో నటించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రవితేజ.. వంటి స్టార్ హీరోలు ఈ ఏడాది క్రేజీ రీమేక్ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి మరియు మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళాశంకర్ చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. తమిళ్ లో అజిత్ నటించిన వేదాలం మూవీ కి రీమేక్ గా వచ్చిన భోళాశంకర్ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకొని ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్రో మూవీ కూడా తమిళ మూవీ అయిన వినోదయ సీతాం మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

తమిళ్ లో కంటెంట్ పరంగా సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ తెలుగులో పవన్ కళ్యాణ్ నటించినప్పటికి సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కేవలం పవన్ కల్యాణ్ అభిమానులకు మాత్రమే అన్నట్లుగా ఉండే బ్రో మూవీ కమాన్ ఆడియన్స్ ను నిరాశ పరిచి ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఈ ఏడాది వచ్చిన మరో స్టార్ హీరో మూవీ రావణాసుర. మాస్ రాజ రవితేజ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బెంగాలీ మూవీ అయిన ‘వీంసిధా’ అనే మూవీకి రీమేక్. కంటెంట్ పరంగా మూవీ పరవాలేదనిపించినప్పటికి స్క్రీన్ ప్లే స్లో గా ఉండడంతో రావణాసుర మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ కూడా రీమేక్ మూవీనే. మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. మంచి సినిమాగా రంగమార్తాండ ప్రశంశలు అందుకున్నప్పటికి కమర్షియల్ గా మూవీ ఫ్లాప్ గా నిలిచింది. ఓవరాల్ గా రీమేక్ గా తెరకెక్కిన ఏ మూవీ కూడా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద మెప్పించలేక పోయాయనే చెప్పాలి.

Also Read:రికార్డుల మోత..సౌతాఫ్రికా చిత్తు!

- Advertisement -