తెలంగాణ కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..సాగునీరు, తాగునీరు, కరెంట్ ఇవ్వలేని అసమర్థత గురించి చెప్తే ఉలికిపాటు ఎందుకు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధుల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పటికీ, పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నాయకులే అన్నారు. కాంగ్రెస్ హయాంలో సాగు, తాగునీటికి దిక్కు లేదు. కరెంట్ అనేది అడ్రస్సే లేదని ఆరోపించారు. పాలమూరు నుంచే ప్రతి సంవత్సరం 14 లక్షల మంది వలసలు పోయే వారని కేటీఆర్ గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి రోజు రెండు బస్సులు ముంబైకి పోయేవి. నారాయణపేట, మక్తలో కూడా ఇదే పరిస్థితి. వలసలు చూసి కన్నీళ్లు కార్చేవారు…. మహబూబ్‌నగర్‌లో 50 ఎకరాలు ఉన్న రైతు గుంపు మేస్త్రీగా పని చేసుకునే దుస్థితి అన్నారు. పదేండ్లు విధ్వంసం జరిగిందన్నారు. మరి 50 ఏండ్ల విధ్వంసం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read:ప్యానల్ స్పీకర్‌గా రేవూరి